- విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం
- రాష్ట్ర అభివృద్దిలో విద్యుత్ పాత్ర చాలా ముఖ్యం
- రైతులకి సోలార్ సిస్టమ్ అందించేందుకు కృషి చేస్తున్నాం :
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నిరుద్యోగులకు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుభవార్తా అందించారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ లో విద్యుత్ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, విద్యుత్‌శాఖ నుంచి త్వరలో భారీ నోటిఫికేషన్ రాబోతుందని తెలిపారు. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు. రాష్ట్ర అభివృద్దిలో విద్యుత్ పాత్ర చాలా ముఖ్యమని, ఎక్కడ కూడా కరెంట్ సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులకి సోలార్ సిస్టమ్ అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ అధికారులు పొలం బాట పట్టాలని అన్నారు. పంట పొలాల్లో కరెంట్ స్థంబాలు ఒరిగిపోకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న లైన్మెన్ల ప్రవర్తన సరిగ్గా లేకుంటే చెడ్డపేరు వచ్చే అవకాశముందని అన్నారు. విద్యుత్ సమస్యల కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు.