బాలాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన చోటు చేసుకొంది. ఇన్‌స్పెక్టర్ ఎం. సుధాకర్ తెలిపిన వివరాల మేరకు మల్లాపూర్ గ్రామానికి చెందిన జంగయ్య కుమారుడు దుబ్బ శ్రీనివాస్ (56) ఆటో డ్రైవర్, ఇతను తన వృత్తి ద్వారా వచ్చే సంపాదనతో తృప్తి చెందక అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో నిషేదిత గంజాయి వ్యాపారం చేస్తూ గతంలో మీర్పేట్ పోలీసులకు, సరూర్నగర్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. అయినప్పటికీ అతడు మళ్ళి గంజాయి విక్రయించడం ప్రారంభించాడు పక్క సమాచారం మేరకు శ్రీనివాస్ గంజాయి విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకోని అతని నుండి 48 గ్రా గంజాయి స్వాధీనం చేసుకొని నిందితుడిపై వివిధ సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు జైలుకు తరలించామని తెలిపారు.