టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్ సన్మానం
సదాశివపేట ఆంజనేయస్వామి దేవాలయం నుండి భద్రాచలం వరకు హైందవ ధర్మ పరిరక్షణకు పాదయాత్ర చేస్తోన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేణు మాధవ్ బృందాన్ని టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్ ఘనంగా సన్మానించారు. పటాన్ చెరువు ఓఆర్ఆర్ సమీపంలో పాదయాత్రికులతో భేటీ అయిన బైండ్ల కుమార్, యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందు ధర్మంపై జరుగుతున్న అసాంఘిక శక్తుల దాడులకు నిరసనగా, హైందవ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాలని, లోకకల్యాణాన్ని కోరుతూ చేపట్టిన ఈ పాదయాత్ర విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. దేవేందర్ గౌడ్, న్యాయవాది మరియు బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.