అవనికి అభిషేకం .. వాన ధారలు
మండుటెండను మనసులోన దాచుకున్నది
మరిగి భాష్పవాయువై మిన్నంటుకున్నది
పరిసరాలకు ప్రాణ వాయువు పంచుతున్నది
అవసరానికి గొంతు తడిని తీర్చుతున్నది
మేఘమై సుడిగాలిలో ఉరుములే తన పిలుపులై
వనములే హారతులుగా మెరుపు తీగలధారమై
వానధారలు అవనికే అభిషేకమన్నది…
పుడమి తల్లికి పురుడు పోసి కల్పతరువై కాలచక్రం తిప్పుతున్నది
- అందెల రవళి