మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో సీనియర్ డ్రాఫ్ట్‌మెన్ జ్యోతిక్షేమాబాయి రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం, మహబూబాబాద్ పట్టణ శివారులోని మూడు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసేందుకు వరంగల్ జిల్లాకు చెందిన తాళ్ల కార్తీక్ భూమికి సంబంధించిన వివరాల కోసం గత నెల 28న కలెక్టరేట్‌లోని సర్వే, భూమి రికార్డుల విభాగంలో దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించి రూ. 05 వేలతో చలన తియ్యలని సీనియర్ డ్రాఫ్ట్‌మెన్ జ్యోతిక్షేమాబాయి చెప్పడంతో కార్తీక్ ఆమెకు రూ. 05 వేలు చెల్లించాడు. మళ్లీ రెండు రోజుల తర్వాత కార్తీక్ నక్ష కోసం కార్యాలయానికి రావడం జరిగింది. రూ.20 వేలు చెల్లిస్తేనే నక్ష వస్తుందని జ్యోతిక్షేమాబాయి చెప్పడంతో లంచం ఇవ్వడం ఇష్టంలేని కార్తీక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రూ.20,000 లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.