సిద్దిపేట జిల్లా కూనూరుపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిధుల దుర్వినియోగంపై స్పందించని డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కుకునూరు పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిధులు దుర్వినియోగమైనట్లు వచ్చిన ఆరోపణలపై ఓ వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన 30 రోజుల లోగా దరఖాస్తు దారునికి సమాచారం ఇవ్వాలి. గడువు దాటిపోయిన ఇప్పటివరకు కుకునూరుపల్లి పిహెచ్సి డాక్టర్ పర్వీన్ సమాచారం ఇవ్వకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తున్నాయి.
సమాచారం ఇవ్వని డాక్టర్ పై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కుక్కునూరు పల్లి పిహెచ్సికి రెండుసార్లు ఎన్ క్వాస్ ద్వారా మంజూరైన నిధులు,, హాస్పిటల్ డెవలప్మెంట్ నిధులు, ఎస్బిఐ ఆక్టివిటీ ద్వారా వచ్చిన పది లక్షల రూపాయలల్లో అవినీతి అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలున్నాయి. వాటిలో నిజానిజాలు తెలుసుకోవడానికి ఆర్ టి ఐ ద్వారా దరఖాస్తు చేసుకోగా సంబంధిత డాక్టర్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆర్ టి ఐ యాక్ట్ ను పట్టించుకోకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన డాక్టర్ పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పిహెచ్సిలో నిధుల దుర్వినియోగం జరగకపోతే ఎందుకు సమాచారం ఇవ్వడం లేదని ప్రజలు డాక్టర్ ను ప్రశ్నిస్తున్నారు. సమాచారం ఇవ్వలేదంటే అవినీతి జరిగినట్లే కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లాస్థాయి ఉన్నతాధికారులు సంబంధిత డాక్టర్ పై చర్యలు తీసుకొని, సమాచారం ఇప్పించాలని ప్రజలు కోరుతున్నారు.