Thursday, November 21, 2024
spot_img

స‌ర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్‌లో బ‌రితెగించిన ఏడీ, డీఐలు

Must Read

(త‌ప్పుడు రిపోర్ట్‌తో సుమారు రూ. 400 కోట్ల ప్రభుత్వ భూమి క‌బ్జా)

  • కబ్జాచేసిఅక్ర‌మంగా బిల్డింగ్ నిర్మిస్తున్న రోహిత్ రెడ్డి
  • గ‌తంలోనే సర్కారు భూమిగా స‌ర్వే చేసి, తేల్చిన అప్ప‌టి ఏడీ ఎం. రామ్‌చంద‌ర్‌, ఏడీ శ్రీనివాస్‌లు, డీఐ గంగాధ‌ర్‌
  • ముడుపులు తీసుకొని త‌ప్పుడు రిపోర్ట్ ఇచ్చిన డీఐ స‌త్తెమ్మ‌, ఏడీ శ్రీనివాసులు
  • ఏడీ దాఖ‌లు చేసిన త‌ప్పుడు రిపోర్ట్‌ను మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్ ర‌ద్దు చేసిన వైనం
  • గ‌త రిపోర్ట్ ఆధారంగా ప్ర‌భుత్వ స్థ‌లంగా గుర్తించిన క‌లెక్ట‌ర్‌
  • జీహెచ్ఎంసీ అనుమ‌తులు ర‌ద్దు చేయాల‌ని ఆదేశాలు
  • క‌లెక్ట‌ర్ ఆదేశాల‌తో అనుమ‌తులు ర‌ద్దు చేయుట‌కు జీహెచ్ఎంసీ, భూక‌బ్జాదారుడికి షోకాజ్ నోటీసులు జారీ
  • ఏడీ శ్రీనివాసులు అప్పుడు ఒక రిపోర్ట్‌, ముడుపులందిన త‌ర్వాత మ‌రో రిపోర్ట్‌
  • త‌ప్పుడు రిపోర్ట్ ఇచ్చిన డీఐ స‌త్తెమ్మ‌, ఏడీ శ్రీనివాసులు పై చ‌ర్య‌లు శూన్యం..
  • ప్ర‌భుత్వ భూమి కాపాడలేని మేడ్చ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ప్రభుత్వ, అసైన్డ్ ల్యాండ్ లు కనిపించినా అక్రమార్కులు కబ్జాచేస్తున్నారు. మండల తహసిల్దార్‌ కార్యాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు, జోనల్‌ ఆఫీస్‌ నుంచి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు తెలిసి కూడా ప్రభుత్వ భూములను కొందరు కొల్లగొట్టారు.. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న కనీసం పట్టింపు లేకుండా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాజకీయ, డబ్బు పలుకుబడి ఉన్నోళ్ల వద్ద నుంచి మాముళ్లు తీసుకొని ఇట్టే పనిచేసి పెట్టడం సర్వ సాధారణం. నాది కాదు నాకేం పట్టింది అన్నట్టుగా జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, అధికారులు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే.. నగరం నడిబొడ్డు అయిన ఉప్పల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి అన్యక్రాంతం అవుతుంది. ఉప్ప‌ల్ కల్సా గ్రామంలోని సర్వే నెం. 581/1లో 7 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ లో ప్రభుత్వ అధికారుల అండతో కబ్జాదారులు మ‌రియు రోహిత్ రెడ్డి దర్జాగా బిల్డింగ్ కట్టేశాడు. సుమారు 400కోట్ల రూపాయల విలువైన సర్కారు భూమిని రోహిత్‌ రెడ్డి కబ్జా చేస్తే, కొంద‌రు ఆఫీస‌ర్లు ఫుల్‌ సపోర్ట్‌ చేయడం వెనుక ఆంతర్యామేంటో అర్థం కావడం లేదు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులకు మాముళ్లు ముట్టజెప్పి కోట్లాది రూపాయల జాగను ఎంచక్క కొట్టేశాడు. అప్ప‌టి మండ‌ల స‌ర్వేయ‌ర్ వెంక‌టేశ్ త‌ప్పుడు రిపోర్ట్ ఇవ్వ‌డంతో ఉన్న‌తాధికారులు స‌మ‌గ్రంగా విచారించి, అత‌నిపై శాఖ ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింది. అంతేకాకుండా ఈ విష‌యంపై స‌మ‌గ్రంగా స‌ర్వే చేసి, నివేదిక‌ను స‌మ‌ర్పించాల్సిందిగా స‌ర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ను ఆదేశించారు. క‌లెక్ట‌ర్ ఆదేశాల ప్ర‌కారం అప్ప‌టి ఏడీ, డీఐ గంగాధ‌ర్‌తో క‌లిసి క్షేత్ర‌స్థాయిని ప‌రిశీలించి, స‌మ‌గ్రంగా స‌ర్వే చేసి రోహిత్ రెడ్డి నిర్మిస్తున్న నిర్మాణం స‌ర్వే నెం. 584లో కాకుండా ప్ర‌భుత్వ భూమి అయిన 581/1 లో నిర్మిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మైన రిపోర్ట్‌ను క‌మిష‌న‌ర్ అండ్ డైరెక్ట‌ర్ స‌ర్వే సెటిల్‌మెంట్ మ‌రియు లాండ్ రికార్డ్స్ అధికారుల‌కు, ఆర్‌డీడీ ల‌కు అంద‌జేశారు.

ఇదే విష‌యంపై అప్ప‌టి మండ‌ల స‌ర్వేయ‌ర్ వెంక‌టేష్ భూక‌బ్జాదారుడితో లోపాయికారి ఒప్పందం చేసుకొని అక్ర‌మంగా నిర్మిస్తున్న నిర్మాణం ప‌ట్ట‌భూమి అయిన 584లో ఉన్న‌ట్లు రిపోర్ట్ ఇవ్వ‌డం త‌ప్పు అని, మండ‌ల స‌ర్వేయ‌ర్ వెంక‌టేష్ త‌ప్పుడు రిపోర్ట్ ఇచ్చాడ‌ని తెలుపుతూ, అట్టి నిర్మాణం 581/1 లో నిర్మిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేయ‌డం జ‌రిగింది. అంతే కాకుండా వెంక‌టేష్ త‌ప్పు చేసిన‌ట్లు నిర్దారించ‌డం జ‌రిగింది.

కాగా, అవినీతికి అల‌వాటుప‌డ్డ ఏడీ శ్రీనివాసులు అక్ర‌మంగా ప్ర‌భుత్వ‌భూమిలో స‌ర్వేనెం. 581/1 లో నిర్మిస్తున్న నిర్మాణ‌దారుడితో భారీ ఎత్తున ముడుపులు తీసుకొని, డీఐ స‌త్తెమ్మ‌తో మ‌ర‌ల స‌ర్వే చేయించి రోహిత్ రెడ్డి నిర్మిస్తున్న నిర్మాణం స‌ర్వే నెం. 584లో వ‌స్తున్న‌ట్లు నివేదికను (ఏ2/పివి/16/2024 తేది 09-05-2024) క‌లెక్ట‌ర్‌కు అందించ‌డం జ‌రిగింది. క‌లెక్ట‌ర్ అట్టి నివేదిక‌ను ప‌రిశీలించిన అనంత‌రం ఏడీ ఎం. రామ‌చంద‌ర్ రావు 2022లోనే స‌ర్వే నెం. 581/1 ప్ర‌భుత్వ భూమిలో నిర్మాణం చేప‌డుతున్నారని ఇచ్చిన నివేదిక‌ను (ఏ2/1092/2022) కాద‌ని,
మండ‌ల స‌ర్వేయ‌ర్ వెంక‌టేష్‌పై ఉన్న ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ అధికారిగా ఏడీ శ్రీనివాసులు విచారించి, 581/1 లో భూ ఆక్ర‌మ‌ణ దారుడు రోహిత్ రెడ్డి అక్ర‌మంగా నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని స్ప‌ష్ట‌మైన నివేదిక‌ను స‌ర్వే అండ్ లాండ్ రికార్డ్స్ అధికారుల‌కు, క‌లెక్ట‌ర్‌కు స‌మ‌ర్పించిన విష‌యాన్ని గుర్తు చేస్తూ.. ఏడీ శ్రీనివాసులు కొత్త‌గా త‌ప్పుడు రిపోర్ట్ ఇవ్వ‌డంపై ఆగ్ర‌హించి, అట్టి రిపోర్ట్‌ను ర‌ద్దు చేయ‌డం జ‌రిగింది.. క‌లెక్ట‌ర్ ఆదేశాల మేర‌కు ఏడీ శ్రీనివాసులు, డీఐ స‌త్తెమ్మ సంయుక్తంగా ఇచ్చిన త‌ప్పుడు రిపోర్ట్‌ను ఏడీ శ్రీనివాసులు ర‌ద్దు చేస్తూ ఎండాస్‌మెంట్ (ఏ2/పివి/16/2024, తేది 28-08-2024) చేయ‌డం జ‌రిగింది.

కానీ, ఈ పూర్తి విష‌యం ఉన్న‌త న్యాయ‌స్థానానికి తెలుప‌కుండ రోహిత్ రెడ్డి కోర్టును సైతం త‌ప్పుడు స‌మాచారం అందించి, నిర్మాణ ప‌నులు చేప‌డుతున్నారు. ఒకే అధికారి రెండు విధాలా రిపోర్ట్‌ను ఇచ్చిన ఈ రోజు వ‌ర‌కు క‌లెక్ట‌ర్ కానీ, స‌ర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఉన్న‌తాధికారులు కానీ ఏడీ శ్రీనివాసుల‌పై చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.. సుమారు రూ.400 కోట్ల ప్ర‌భుత్వ భూమిని కాపాడ‌లేని అస‌మ‌ర్థ అధికారుల‌పై ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకొని, ప్ర‌జ‌ల సంక్షేమం కొర‌కు అట్టి భూమిని వినియోగించాల‌ని స్థానిక ప్ర‌జ‌లు కోరుతున్నారు.

Latest News

రామ్ గోపాల్ వర్మకు మళ్లీ పోలీసుల నోటీసులు

తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు మరోసారి నోటీసులు జారీచేశారు. ఈ నెల 25న ఒంగోలు పోలీస్ స్టేషన్‎లో విచారణకి హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS