Thursday, December 12, 2024
spot_img

ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించారు

Must Read
  • బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలను మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్య అనంతరకాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని, ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక తదితర రంగాల్లో అణగారిన వర్గాలకు సమాన వాటా సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో బాబాసాహెబ్ కనబరిచిన దార్శనికత మహోన్నతమైనదని కేసీఆర్ కొనియాడారు. దేశంలో రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3, ఈ దిశగా వారి దార్శనికత, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం చూపిందని తెలిపారు. వారి విశేష కృషిని, వారు అందించిన స్ఫూర్తిని చాటేందుకు ప్రపంచంలోనే అత్యంత మహోన్నతమైన రీతిలో వారి స్ఫురద్రూపాన్ని తెలంగాణాలో అత్యంత ఎత్తయిన విగ్రహంగా నిలుపుకున్నామన్నారు. దేశ పాలనకు తన రాజ్యాంగం ద్వారా బాటలు వేసిన బీఆర్‌ అంబేద్కర్ ఘనమైన కీర్తిని చాటేందుకు దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా తెలంగాణ పాలనా భవనానికి ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్’ అని పేరు పెట్టుకున్నామని తెలిపారు.

Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS