సిరీస్ మధ్యలో రిటైర్‌మెంట్ ప్రకటన
వెస్ట్ ఇండీస్ ఆల్ రౌండర్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ తర్వాత ఆట నుంచి తప్పుకోనున్నాడు. జులై 21 నుంచి వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఆండ్రీ రస్సెల్‌ను ఎంపిక చేశారు. అయితే అతను సిరీస్ మధ్యలోనే రిటైర్‌మెంట్ తీసుకుంటాడు. రస్సెల్ రెండో మ్యాచ్ తర్వాత రిటైర్‌మెంట్ తీసుకుంటాడు. సిరీస్‌లో రెండో మ్యాచ్ జులై 23న జమైకాలోని సబీనా పార్క్ కింగ్‌స్టన్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్ రస్సెల్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుంది.
37 ఏళ్ల ఆండ్రీ రస్సెల్ 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు, నవంబర్ 15న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తన తొలి, ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆరు నెలల తర్వాత 2011లో రస్సెల్ టీ20, వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు.ఆండ్రీ రస్సెల్ వన్డేల్లో 4, టీ20ల్లో 3 అర్ధ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో అతని అత్యుత్తమ స్కోరు 92 నాటౌటు, ఇది ఒక రికార్డు. రస్సెల్ ఇన్నింగ్స్ వన్డేలలో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన ఏ ఆటగాడికైనా అత్యధిక స్కోరు ఇదే. .వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుంది, దీనికి భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. రస్సెల్ దానికంటే ముందే రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడు. అతను తన కెరీర్‌లో 2 సార్లు ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగమయ్యాడు. వెస్టిండీస్ 2012, 2016లో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది, రెండిరటిలోనూ ఆండ్రీ రస్సెల్ కీలక పాత్ర పోషించాడు. 2016 సెమీ-ఫైనల్‌లో అతను టీమ్ ఇండియాపై 20 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు.