Wednesday, January 29, 2025
spot_img

మహారాష్ట్ర ఎన్నికలకు అప్ దూరం

Must Read
  • వెల్లడించిన పార్టీ నేత సంజయ్‌ సింగ్‌
  • జార్ఖండ్ విషయంలోనూ ఇదే నిర్ణయం తీసుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ
  • మహారాష్ట్ర లో మహా వికాస్‌ అఘాఢీ కూటమిలోని పార్టీలకు మద్దతుగా అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రచారం..!
  • హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఖాతా తెరవడం విఫలం

మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఖాతా తెరవడంలో విఫలమైన అప్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత సంజయ్‌ సింగ్‌ వెల్లడించారు. మహా వికాస్‌ అఘాఢీ కూటమిలోని పార్టీలకు మద్దతుగా తమ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ విషయంలోనూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇదే వైఖరి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. హేమంత్‌ సోరెన్‌కు మద్దతుగా జార్ఖండ్ ముక్తి మోర్చాకు కేజీవ్రాల్‌ ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మహరాష్ట్రలోని 288 స్థానాలకు నవంబర్‌ 20న పోలింగ్‌ జరగబోతుంది.జార్ఖండ్ లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి.రెండు రాష్ట్రాలలో నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి పోటీగా విపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమి స్థాపించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీ, గుజరాత్‌, హరియాణా రాష్టాల్లో కాంగ్రెస్‌తో కలిసి ఆప్‌ పోటీ చేసింది. ఒక్క పంజాబ్‌లో మాత్రం ఒంటరిగా బరిలోకి దిగింది. ఇటీవల జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సొంతంగా పోటీ చేసి ఖాతా తెరవడంలో విఫలమైంది. తాజాగా మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా నిలిచింది.

Latest News

కొండంత.. ప్రాబ్లమ్స్

సమస్యలు ఫుల్.. ఏర్పాట్లు నిల్ భక్తులకు తీవ్ర.. ఇబ్బందులు టెండర్లు యదా తదం దోపిడీ కామన్ భక్తుల జేబులు గుల్ల వారు అనుకుంటే వార్ వన్సైడే. దోపిడీని అడ్డుకునే వారు ఎవ్వరూ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS