తెలంగాణ రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గురువారం పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. చార్మినార్ ప్రాంతంలోని కోమట్వాడి , నూర్ఖాన్ బజార్లో ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న మెడికల్ షాప్స్ పై దాడులు నిర్వహించి రూ.18,000 విలువైన యాంటీబయాటిక్స్, అనాల్జెసిక్స్ మొదలైన 23 రకాల మందులను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ లైసెన్స్ లేకుండా మందులను నిల్వ ఉంచడం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుందని అధికారులు తెలిపారు.
మేడ్చల్-మల్కాజిగిరిలోని చింతల్, కుత్బుల్లాపూర్ గ్రామాలలో ఎలాంటి విద్యార్హత లేకుండా మెడిసిన్ చేస్తున్న పీ రవీంద్రన్ పై డీసీఏ బృందాలు దాడులు నిర్వహించాయి. సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాడి గ్రామంలో కూడా డీసీఏ బృందాలు దాడులు నిర్వహించాయి. 21 రకాల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మోర్‌లోని లక్రా పాలిటెక్స్‌చే తయారు చేయబడిన థియోగెట్ టాబ్లెట్‌లను (థయామిన్ హైడ్రోక్లోరైడ్ 100 ఎంజీ టాబ్లెట్‌లు) మార్కెట్లో అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.