Saturday, March 22, 2025
spot_img

ఎపిలో డ్రగ్స్‌, మెడికల్‌ షాపులపై దాడులు

Must Read
  • డిజిపి ఆదేశాలతో విజిలెన్స్‌, డ్ర‌గ్ ఇన్‌స్పెక్ట‌ర్లు తనిఖీలు
  • మందుల నాణ్యత, రికార్డులను ప‌రిశీలించిన అధికారులు

ఆంధ్రప్రదేశ్‌ లో మెడికల్‌ షాపులు, ఏజెన్సీలపై డ్రగ్‌ ఇన్‌స్పెక్ట‌ర్లు, విజిలెన్స్‌, పోలీస్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మెడికల్‌ ఏజెన్సీలు మందుల షాపులపై విజిలెన్స్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్ట‌ర్లు, ఈగల్‌ బృందాలు తనిఖీలు చేపట్టాయి. మందుల నాణ్యత, రికార్డులను అధికారులు పరిశీలించారు. విజిలెన్స్‌ ఎస్పీ ఎం.స్నేహిత, డ్రగ్స్‌ ఏడి నాగమణి రాజమండ్రి తిరుమల శ్రీనివాస్‌ మెడికల్‌ ఏజెన్సీలో ఆకస్మిక తనిఖీలు చేశారు. మెడికల్‌ గా ఒకే మోతాదులో వినియోగించే సిరఫ్‌, ఇంజక్షన్లు మత్తు మందులను కొంతమంది యువత అక్రమంగా వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో డీజీపీ ఆదేశాలతో మెడికల్‌ షాపులలో నాలుగు ప్రత్యేక బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. రాజమండ్రిలో డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్ లేకుండా తిరుమల ఏజన్సీలో విక్రయిస్తున్న ట్రమడాలు మత్తుమందు 255 ఇంజక్షన్లను విజిలెన్స్‌ ఎస్పీ స్నేహిత పట్టుకున్నారు. యువత కొంతమంది తప్పుడుగా వైద్యం కోసం వినియోగించే మత్తు కలిగించే మెడిసిన్స్‌ ను విరివిగా వాడుతున్నట్టు సమాచారం. అందుకే డిజేపీ ఆదేశాలతో జిల్లాలో 16 చోట్ల దాడులు చేస్తున్నామని తెలిపారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్‌ ఏజెన్సీలో, మెడికల్‌ షాపులలో ట్రమాడాల్‌ ఇంజక్షన్లు, మత్తు కలిగించే సెరఫ్‌ లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 బృందాల ఆధ్వర్యంలో ఆపరేషన్‌ గరుడ నిర్వాహిస్తున్నామని ఈగల్‌ టీమ్‌ ఐజీ రవికృష్ణ తెలిపారు. గుణదల మెడికల్‌ షాప్‌ లో ఆకస్మిక దాడులు చేశారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న మెడికల్‌ షాపులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమతి లేని మందులు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రిస్క్రిప్షన్ మీద అమ్మవలసిన మందులు మాత్రమే మందుల షాపులో విక్రయించాలి. అలా లేనియెడల వారిపై చర్యలు తీసుకుంటామని డ్రగ్స్‌ డైరెక్టర్‌ ఎంబీఆర్‌ ప్రసాద్‌ వెల్లడించారు.

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్ట వాటిల్లే ప్రమాదం

కావాలనే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర వివక్ష : మాజీ మంత్రి కేటీఆర్‌ కేంద్రం ప్రభుత్వం ఎప్పటి నుంచో కక్షపూరిత ధోరణితో దక్షిణాది రాష్ట్రాలపై అవలంబిస్తుందని మాజీమంత్రి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS