బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటం శివ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకొని నిర్బంధ పాలన చేస్తున్నారని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటం శివ విమర్శించారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాటం శివ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ సర్కార్ భయపడిపోతుందని...
ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 29న జరిగే విద్యార్థి విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ శనివారం ఓయూ జేఏసీ, టిజి జేఏసీ, టిపిసిసి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోపే 55 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు....
ఆపదలో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలిచిందని జంగయ్య యాదవ్ తెలిపారు. శనివారం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఎనుగుల కృష్ణప్రియకి రూ.60,000, బి.నరేందర్ గౌడ్‌కి రూ. 60,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జంగయ్యయాదవ్ మాట్లాడుతూ, పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. పేద...
అసాధ్యం అనుకున్న తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కేవలం సోనియా గాంధీ దృఢ నిశ్చయం, త్యాగ నిరతి వల్లే సాధ్యమైందని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధనలో సోనియా గాంధీ అమూల్యమైన పాత్రను ప్రతిబింబిస్తూ సీనియర్ జర్నలిస్ట్ పురుషోత్తం నారగౌని...
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన దిల్‌రాజు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు దిల్ రాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
టిఎఫ్‌డిసి ఛైర్మన్‌గా దిల్రాజును నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.
హామీలను అమలుచేయకుండా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది
అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు
అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని నడిపే ప్రభుత్వాలు ఎక్కువరోజులు మనుగడ సాగించలేవు
హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా అబద్దపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
బిజెపి ప్రజల వికాసానికి పనిచేస్తే..కాంగ్రెస్ స్వలాభం కోసం పనిచేస్తుంది
హిమాచల్‌ప్రదేశ్ లో ఉచిత కరెంట్ ఇస్తామని అన్నారు
ప్రాంతీయ పార్టీల పుణ్యాన కాంగ్రెస్...
సినిమా ప్రభావం సమాజంపై చెప్పలేనంత..భక్తినో, దేశభక్తినో, బంధాలు, యువతలో గొప్ప విలువలనోపెంచాల్సిన బాధ్యతలు విస్మరించిన రీల్ హీరో సినిమాలకు కాలం చెల్లనుందిఅడవికి అంటుకున్న ఫైర్ లా సమాజంలోని విలువలను దహించివేస్తున్నాయిస్మగ్లింగ్ చేసే దోపిడి దొంగదే రూలుగా చూపిస్తూ సామాజిక బాధ్యత విస్మరించినా పట్టించుకోని సెన్సార్ బోర్డ్!ప్రభుత్వాలు ఇలాంటి సినిమాలకు టికెట్ల ధరలు భారీగా పెంచి...
సిరియాలో బషర్ అల్-అసద్ నేతృత్వంలోని తిరుగుబాటు దారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ దళాల్ని వెనక్కినెడుతూ కీలక పట్టణాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే వీరు అనేక కీలక పట్టణాలను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సిరియాలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగశాఖ అలర్ట్ అయింది. ఈ...
బీహార్ రాష్ట్ర రాజధాని పట్న నగరంలోని బీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ నిబంధనల్లో మార్పులు చేయడంతో పోటీ పరీక్షల అభ్యర్థులు నిరసనకు దిగారు. బీపీఎస్సీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.
డిసెంబర్...
సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని సైనిక సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల విరాళం అందజేశారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనిక్ వెల్ఫేర్ విభాగం డైరెక్టర్ కల్నల్ పి.రమేశ్ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి త్రివర్ణ పతాక స్టిక్కర్‌ను అందించారు. యుద్దంలో గాయపడిన వీర...