Sunday, August 3, 2025
spot_img

Aadab Desk

దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ విధింపు

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరకొరియాపై సానుభూతి చూపిస్తూ ప్రతిపక్షాలు దక్షిణ కొరియా రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని..ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఎమర్జెన్సీ విధించక తప్పని పరిస్థితి ఏర్పడిందని యూన్ యోల్ తెలిపారు.

పిఎస్ఎల్వీ- సీ 59 ప్రయోగం వాయిదా

పిఎస్ఎల్వీ- సీ 59 ప్రయోగం వాయిదా పడింది. బుధవారం సాయింత్రం 4.08 గంటలకు పీఎస్ఎల్వీ -సీ 59ను సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి నింగీలోకి పంపాలని శాస్త్రవేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఉపగ్రహంలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా పీఎస్ఎల్వీ- సీ 59 ప్రయోగం వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. గురువారం...

మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్..రేపే ప్రమాణస్వీకారం

మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుపై గతకొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‎కు ఎట్టకేలకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా బిజెపి సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. బుధవారం జరిగిన బిజెపి కోర్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ పేరుకు ఆమోదం లభించింది. రేపు మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముంబైలోని ఆజాద్ మైదానంలో...

అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వండి..హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు

మాజీమంత్రి హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‎లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్‎లో హరీష్‎రావు పేర్కొన్నారు. అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు...

పోరుబాటకు సిద్ధమైన వైసీపీ.. కార్యాచరణ ప్రకటించిన జగన్

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన జరిగిన వైసీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రైతుల సమస్యలు,కరెంట్ చార్జిలు, ఫీజు రియంబర్స్మెంట్ పై వైసీపీ పోరుబాట కార్యాచరణ ప్రకటించారు. రైతు సమస్యలపై డిసెంబర్ 11న ర్యాలీలు, కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వనున్నారు. డిసెంబర్ 27న విద్యుత్ చార్జీలపై ఆందోళనలు, జనవరి...

గ‌*జాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

బాలాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో అక్రమంగా గ‌*జాయిని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన చోటు చేసుకొంది. ఇన్‌స్పెక్ట‌ర్‌ ఎం. సుధాకర్ తెలిపిన వివరాల మేరకు మల్లాపూర్ గ్రామానికి చెందిన జంగయ్య కుమారుడు దుబ్బ శ్రీనివాస్ (56) ఆటో డ్రైవర్, ఇతను తన వృత్తి ద్వారా వచ్చే సంపాదనతో తృప్తి చెందక అక్రమ మార్గంలో డబ్బులు...

ధోనీ నాతో మాట్లాడడం లేదు..హర్భజన్ కీలక వ్యాఖ్యలు

ధోనీ నేను స్నేహితులం కాదు.. మా ఇద్దరి మధ్య మాటల్లేవ్ అంటూ భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇద్దరి మధ్య మాటలు లేక 10 సంవత్సరాలు దాటిందని తెలిపాడు.ధోనీ నాతో మాట్లాడడం లేదు, దానికి కారణం ఎంతో నాకు తెలియదు..నేను ఐపీఎల్‎లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నప్పుడు...

రైతు భరోసా ఎక్కడ..?

రైతుభరోసా అమలు విషయంలో 'గుడ్డి కన్న మెల్ల మిన్న అన్న భావన రైతులలో కలుగచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం 'రైతూ బంధు' పేరుతో ప్రతీ సీజన్ కి ఎకరాకు 5,000 చొప్పున ఆర్ధిక సహాయం క్రమం తప్పకుండా అందించి రైతులకు వ్యవసాయం లో ఆర్థిక చేయూత ఇచ్చింది అనేది నగ్న సత్యం....

హైదరాబాద్‎లో రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

ఏ ఒక్కరోజు కూడా రోశయ్య పదవుల కోసం పోటీ పడలేదని, అయిన ప్రతిభను చూసి పదవులే అయిన వద్దకు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రోశయ్య వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‎లోని హైటెక్స్ లో ఎగ్జిబిషన్ సెంటర్‎లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రోశయ్య నిబద్ధత వల్లే తెలంగాణ...

రూ.1000 కోట్ల విలువైన భూమి ఖతం..

చెరువును అమాంతం మింగేసిన ఫోనిక్స్.. నడి చెరువులో 45 అంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టిన దారుణం.. పుప్పాలగూడలో పూర్తిగా మాయమైన చెరువు.. గత ప్రభుత్వంలో ఓ మంత్రి చక్రం తిప్పినట్లు విమర్శలు.. ధరణిని అడ్డుపెట్టుకొని దందాలు చేసిన కబ్జా కోర్లు.. ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జాకు తేర లేపిన కేటుగాళ్ళు నిషేధిత జాబితాలో ఉన్న భూమికి బై నెంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు.. హైడ్రా...

About Me

3753 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

వైశ్య వ్యాపార వేత్తల ఐక్యతకు కొత్త వేదిక – జీవీబీఎల్ ఘనంగా లోగో, వెబ్‌సైట్ ఆవిష్కరణ… ఏడు నూతన చాప్టర్ల ప్రకటన

వైశ్య వ్యాపార వేత్తల కోసం వ్యాపార నెట్‌వర్కింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ‘గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్’ (జీవీబీఎల్) సంస్థ శనివారం హైదరాబాద్‌లోని...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS