మాజీమంత్రి హరీష్‌రావు
లక్ష కేసులు పెట్టిన, ప్రజల పక్షాన ప్రశ్నించడం అపను అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు." మిస్టర్ రేవంత్ రెడ్డి అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదిస్తున్నందుకు, నీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీ మీద ప్రశ్నలు...
ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో బృందం అఖిల భారత లాన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలుచుకుంది. ఈ సందర్భంగా డీజీపీ డా.జితేందర్ బృందాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. పోలీస్ డిపార్ట్మెంట్, పారామిలిటరీ బలగాల కోసం సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నవంబర్ 26 నుండి 30 వరకు బెంగళూరులోని కేఎస్‌ఎల్‌టీఏ స్టేడియంలో ఈ...
హమాస్ ఉగ్రవాద సంస్థకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించక ముందే హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయిల్ పౌరులను విడుదల చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.దురాగతాలకు పాల్పడే వారికి నరకం చూపిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మూసీ అభివృద్దికి నిధులు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించిన రైజింగ్ వేడుకల్లో అయిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్ నగర అభివృద్దికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేదని, మాజీ సీఎం కెసిఆర్...
మహారాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. గతకొన్ని రోజులుగా అయిన జ్వరంతో బాధపడుతున్నారు. మహారాష్ట్ర సీఎం పదవి ఎంపిక, మంత్రి పదవుల కేటాయింపు, తదితర అంశాలపై బిజెపి పెద్దలతో చర్చించేందుకు అయిన సోమవారం ముంబైకి చేరుకున్నారు. తాజాగా మంగళవారం షిండే ఆరోగ్యం క్షీణించడంతో అయినను థానేలోని ఓ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు మహారాష్ట్ర...
దేశంలోని ప్రముఖ పర్యాటక స్థలం తాజ్ మహల్‌ను పేల్చేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు ఉత్తర్‌ప్రదేశ్ టూరిజం ప్రాంతీయ కార్యాలయానికి మెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలకు సమాచారం అందించారు.రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ బృందాలు పోలీసులతో కలిసి ముమ్మర తనిఖీలు చేశారు. అనంతరం బాంబు బెదిరింపు ఫేక్ అని...
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన బుధవారం రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, పార్టీ నిర్మాణం, కమిటీల ఏర్పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనకు కార్యాచరణతో పాటు తదితర అంశాలపై వైఎస్ జగన్...
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద గృహాల నిర్మాణాన్ని కేబినెట్ ఆమోదించింది.మరోవైపు సమీకృత పర్యాటక పాలసీ...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు నిధులు మంజూరు చేసింది. రూ.50 కోట్ల నిధులను హైడ్రాకు మంజూరయ్యాయి. హైడ్రాకు సంబంధించిన వాహనాల కొనుగోలు,కార్యాలయ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
వర్ధంతి సభ మీడియా కో ఆర్డినేటర్ కౌటికె విఠల్
మాజీ ముఖ్యమంత్రి, వైశ్య జాతి శిఖామణి కొణిజేటి రోశయ్య వర్ధంతి సభను విజయవంతం చేయాలని సభ మీడియా కో-ఆర్డినేటర్, వైశ్యసంఘం నేత కౌటికె విఠల్ పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైశ్యజాతి రత్నం రోశయ్య సేవలు ఎనలేనివని ఆయన పేర్కొన్నారు. అజాతశత్రువుగా పేరొందిన రోశయ్య...