మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే స్పందించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచిన ఎన్డీయే కూటమికి అభినందనలు తెలుపుతూనే, ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలాంటి విజయం సాధించడానికి మహాయుతి కూటమి ఏం...
పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని రాజకీయ పార్టీ నాయకులు ఓటేసిన ప్రజా అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని, విఘాతం కలిగిస్తున్నారు..వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారడం కొత్తేమీ కాదు..!! పార్టీలన్ని అడ్డుదారుల్లో ఫిరాయింపులను ప్రోత్సహించిన ఆ తాను ముక్కలే..నైతిక విలువలను తుంగలో తొక్కిన వారే..!!నేడు ఎర్ర గురివింద నీతిని బోధించడం చూస్తుంటే..చెప్పేది నీతులు చేసేది వెన్నుపొట్లే.....
లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయిల్ వైమానిక దళాలు మిస్సైళ్లతో దాడి చేశాయి. ఈ దాడిలో 11 మంది మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. 08 అంతస్తుల భవనం పూర్తిగా ధ్వంసమైంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 04 గంటలకు ఈ దాడి జరిగిందని స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్...
జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఏంఏం) పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంది. దీంతో ఈ నెల 26న నాలుగోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభంకానున్నాయి. నవంబర్ 25 నుండి డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగానున్నాయి. సమావేశాల నేపథ్యంలో కేంద్రం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమయ్యారు. రక్షణశాఖ...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. నవంబర్ 09న దళిత బంధు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హుజూరాబాద్‌లో ధర్నా చేపట్టారు. అయితే ఎలాంటి అనుమతి లేకుండా ధర్నా చేపట్టినందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలపై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 35 (3) కింద పోలీసులు...
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు ఇప్పటికైనా అడ్డుకట్ట వేస్తారా.!
రెవెన్యూ అధికారులకే సవాలు విసురుతున్న శ్రీ మంజునాథ కన్స్ స్ట్రక్షన్
ప్రభుత్వ, అసైన్డ్ భూములను పొతంపెడ్తున్న జి.అమరనాథ్ రెడ్డి
శ్రీ మంజునాథ నిర్మాణ సంస్థ, వారి సహచరులు...
రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్
ఆదానీపై కేసు పెట్టాలని ఎన్నిసార్లు కోరిన ప్రధాని మోదీ పట్టించుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదానీ వ్యవహారంపై శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా ఆదానీ...
భారతదేశంలో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ, సాగర్ ఆర్ అదానీ, వినీత్ ఎస్ జైన్ సహా ఏడుగురు $250 మిలియన్ల (రూ. 2,100 కోట్లు) లంచాన్ని అధికారులకు ఆఫర్ చేశారంటూ,అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపింది. పెట్టుబడిదార్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధుల సమీకరణ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపించింది. నిందితులు...
ఇండియన్ నేవీకి చెందిన సబ్‌మెరైన్ ప్రమాదానికి గురైంది. గోవా తీరానికి 70 నాటికల్ మైళ్ళ దూరంలో సబ్‌మెరైన్ ను ఫిషింగ్ బోటు ఢీకొట్టింది. ఈ ఘటనలో బోటులో ఉన్న ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 13 మంది ఉన్నారు. వీరిలో 11 మందిని నేవీ సిబ్బంది రక్షించారు. మరో ఇద్దరి...