విద్యార్థులు, యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి ప్రఖ్యాత అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం అందించింది. అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ ప్రతినిధి బృందం...
తెలంగాణలో గ్రూప్ 01 పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్ 01 పరీక్షలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుండి గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. 08 మంది పిటీషనర్ల కోసం లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందులో పడటం ఏమిటని ప్రశ్నించింది.
ఈ నెల...
ఐ.ఎన్.టీ.యూ.సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ కు ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ తెలంగాణ సంస్ధ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. 30 సంవత్సరాలకు పైగా రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ, వారి జీవితాల్లో వెలుగుల కోసం నిరంతరం పరితపిస్తున్నారు. స్ధానిక సమస్యలు మొదలుకొని, రాష్ట్ర, జాతీయ అంతర్జాతీయ...
ప్రముఖ సినీతార కార్తీక్ ఆర్యన్ నటించిన చిత్రం భూల్ భూలయ్యా 3 ప్రమోషన్‌లలో భాగంగా శుక్రవారం డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్‌ని సందర్శించారు. ఈ నేపథ్యంలో స్కూల్ క్యాంపస్‌లో సినిమా తారలతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్లను నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఎడిఫై వరల్డ్ స్కూల్ డైరెక్టర్ ఏ.కే.అగర్వాల్‌తో పాటు పాఠశాల సిబ్బంది,...
తెలంగాణలోని 09 యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పాలమూరువర్సిటీ వీసీగా జీన్.శ్రీనివాస్, కాకతీయవర్సిటీ వీసీగా ప్రతాప్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఎం.కుమార్, శాతావాహన వర్శిటీ వీసీగా ఉమేష్ కుమార్, తెలుగు యూనివర్సిటీ వీసీగా నిత్యానందరావు, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా ఆల్టఫ్ హుస్సేన్, తెలంగాణ వర్సిటీ వీసీగా...
హైదరాబాద్ లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట ప్రకాశ్ నగర్ లో ఆహార భద్రత టాస్క్‌ఫోర్స్ అధికారులు బాలయ్య చికెన్ సెంటర్ లో తనిఖీలు నిర్వహించారు. కుళ్లిన కోడి మాంసంను పలు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు, మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించిన అధికారులు...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 22 నుండి 24 వరకు రష్యాలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు 16వ బ్రిక్స్ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ వెల్లడించింది. బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని పేర్కొంది.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ముంబయి ట్రాఫిక్ పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తుల నుండి సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం అంటూ ఓ సందేశం వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ ఖాన్ కు భద్రతను మరింత పెంచారు.
"సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం..చంపకుండా ఉండాలంటే రూ. 05 కోట్లు ఇవ్వాలంటూ"...
ఈ నెల 23న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన మంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.