ఏ రాష్ట్రంలో అయితే ప్రశాంతమైన వాతావరణం నెలకొని, సంప్రదాయాలు కాపాడబడుతాయో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దుండిగల్ ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన శ్రీ దత్త సభా మంటపాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సంధర్బంగా...
తోషిబా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మూడు రోజుల పర్యటనలో భాగంగా జపాన్ వెళ్ళిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగ్గజ కంపెనీ తోషిబా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తోషిబా ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ ఉన్నతాధికారి హిరోషి కనేట, వైస్ ప్రెసిడెంట్ షిగే రిజో కవహర, కనేట...
రానున్న 03 రోజులపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. కామారెడ్డి జిల్లాతో పాటు ఖమ్మం, నల్గొండ, వరంగల్, హైదరాబాద్ , మహబూబ్నగర్ జిల్లాలో ఊరుములు, మెరుపులతో వర్షాలు కూరుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు...
సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్ బాబు
నంద్యాలలో జరిగే 42వ జాతీయ స్థాయి జూనియర్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ బాలుర జట్టు విజయం సాధించాలని సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా సాఫ్ట్ బాల్...
మహాత్మాగాంధీ జయంతి సంధర్బంగా బుధవారం హైదరాబాద్లోని చంచల్గూడ మహిళల ప్రత్యేక జైలులో "ఖైదీల సంక్షేమ దినోత్సవం"గా జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఐపీఎస్ డా .సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, జైళ్లశాఖ వారి ప్రయోజనాల కోసం అందిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు.ఈ మేరకు డీజీ ఖైదీలకు పెంచిన వేతనాలను ప్రకటించారు. అనంతరం ప్రత్యేక అతిథిగా హాజరైన...
బంగారం ధరలు బుధవారం భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.500 పెరగగా,24 క్యారెట్లపై రూ.540 పెరిగింది. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.77,450గా నమోదైంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,000 ఉంది.
( ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ పాల్కే పురస్కారం ప్రకటించిన శుభ వేళ )
మాజీ రాజ్యసభ సభ్యుడు, పద్మభూషణుడు, ప్రముఖ బహుభాషల సినీ నటుడు మిథున్ చక్రవర్తికి 2022 సంవత్సరానికి “దాదాసాహెబ్ పాల్కే” అవార్డును 2024 సెప్టెంబర్ 30న కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సముచితంగా, సంతోషంగా ఉన్నది. 16 జూన్ 1950న కోల్‌కతాలోని...
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. బుధవారం అయిన భార్య రజనీతో ఫోన్లో మాట్లాడారు. త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు. రజనీకాంత్ ఆరోగ్య విషయాన్ని తెలుసుకునేందుకు ప్రధాని మోదీ రజనీకాంత్ భార్యతో మాట్లాడారని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై " ఎక్స్" వేదికగా వెల్లడించారు.
రాజస్థాన్లోని పలు రైల్వేస్టేషన్లకు బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. హనుమాన్ ఘర్ జంక్షన్లోని స్టేషన్ సూపరింటెండెంట్ కు గుర్తుతెలియని వ్యక్తి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరుతో ఉన్న లేఖను అందించాడు. జోధ్పూర్ , జైపూర్ , శ్రీరంగానగర్ తో పాటు మరికొన్ని స్టేషన్స్ లో బాంబు దాడులు జరగనున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు....