Friday, December 27, 2024
spot_img

Aadab Desk

మేడ్చల్ పట్టణంలో డ్రగ్స్ పట్టివేత

మేడ్చల్ పట్టణంలో డ్రగ్స్ కలకలం రేపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తూ మేడ్చల్ బస్సు డిపోలో దిగగా నార్కోటిక్ బ్యూరో అధికారులు అతని వద్ద నుండి 600 గ్రాముల డ్రగ్స్‎ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

పవన్‎కళ్యాణ్ పేషీకి బెదిరింపులు..పోలీసుల అదుపులో నిందితుడు

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పేషీకి ఇటీవల బెదిరింపు కాల్స్, సందేశాలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పేషీకి బెదిరింపు కాల్స్, సందేశాలు పంపించిన వ్యక్తిని విజయవాడ పోలీసులు గుర్తించారు. మల్లికార్జునరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద టవర్...

రాష్ట్రపతి విడిది ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్ష

శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. డిసెంబర్ 17 నుండి 21 వరకు రాష్ట్రపతి హైదరాబాద్‎లో ఉండనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా...

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైంది : కేటీఆర్

సోమవారం ఆశా వర్కర్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మంగళవారం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను అయిన పరామర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఆశా వర్కర్ల మీద జరిగిన దాడిపై జాతీయ మానవహక్కుల కమిషన్‎ను కలుస్తామని, మహిళా కమిషన్‎కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో...

సిరియా అధ్యక్షుడు అసద్‎కు ఆశ్రయం కల్పించిన రష్యా

సిరియా దేశ అధ్యక్షుడు బషర్ ఆల్ అసద్‎కు రష్యా ఆశ్రయం కల్పించింది. అసద్‎తో పాటు అయిన కుటుంబసభ్యులకు మానవతా దృక్పధంతో ఆశ్రయం కల్పించామని రష్యా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తిరుగుబాటు దళాలు సిరియా రాజధాని డమాస్కాస్‎ను ఆక్రమించుకోవడంతో అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సిరియా అధ్యక్షుడు బషర్- అల్- అసద్ దేశాన్ని...

సోదరుల మధ్య గొడవలు సహజమే : మోహన్‎బాబు

గతకొన్ని రోజులుగా జరుగుతున్న కుటుంబ వివాదంపై సినీనటుడు మోహన్ బాబు స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఏ ఇంట్లోనైనా సోదరుల మధ్య గొడవలు సహజమే..తమ ఇంట్లో కూడా అలాంటి విభేధాలే వచ్చాయని తెలిపారు. ఇంటి గొడవలను వారు అంతర్గతంగా పరిష్కరించుకుంటారని అన్నారు. గతకొన్ని రోజులుగా మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది....

లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి

రోజురోజుకు లోన్ యాప్ వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. వీరి వేధింపులు తట్టుకోలేక అనేకమంది ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా విశాఖ జిల్లాలో లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి అయ్యాడు. ఈ ఘటన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లోన్ యాప్ నిర్వాహకులు రూ.2 వేల కోసం నరేంద్ర...

సిరాజ్‎కు జరిమానా

భారత్ పేసర్ మహమ్మద్ సిరాజ్ జరిమానా ఎదుర్కున్నాడు. ఆడిలైడ్ టెస్టులో భాగంగా ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‎ను ఔట్ చేసిన తర్వాత సిరాజ్,ట్రావిస్ హెడ్‎ను ఔట్ చేసిన తర్వాత ఆ ఇద్దరు వాగ్వాదానికి దిగారు. దీంతో ఐసీసీ సిరాజ్‎కు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోతతో పాటు డీమెరిట్ పాయింట్ విధించింది.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూత

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్‎లోని అయిన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గతకొంత కాలంగా ఎస్ఎం కృష్ణ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎస్ఎం కృష్ణ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. 1962లో తొలిసారిగా అయిన రాజకీయంలోకి అడుగుపెట్టారు. 1962 ఎన్నికల్లో మద్దూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా...

ఏపీలో మళ్ళీ వానలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది. ఇది రేపటికి తమిళనాడు- శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో బుధవారం నుండి శుక్రవారం వరకు కోస్తా,...

About Me

2200 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

మహారాష్ట్రలో ఓటర్ల జాబితా కుట్ర

బిజెపి గెలుపు వెనక సిఇసి ఉంది బెళగావి సదస్సులో రాహుల్‌ ఆరోపణలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సంచలన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS