హైదరాబాద్ లో పోస్టర్లు,బ్యానర్ల పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో పోస్టర్లు,బ్యానర్లు,కటౌట్ల పై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.