Wednesday, April 2, 2025
spot_img

కేటీఆర్ ఇప్పుడేమంటారో..రేవ్ పార్టీపై స్పందించిన బండి సంజయ్

Must Read

కేటీఆర్ బావమరిది రాజ్‎పాకాల ఫామ్‎హౌస్ లో జరిగిన రేవ్ పార్టీపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ బావమరిది ఫామ్‎హౌస్ లోనే రేవ్ పార్టీలా అని బండిసంజయ్ ప్రశ్నించారు. ” రాజ్‎పాకాల ఫామ్‎హౌస్ లో డ్రగ్స్ పై కేటీఆర్ ఇప్పుడేమంటారో.. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో..? “సుద్దపూస” ను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నాయి, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్ పై రాజీధోరణి ఎందుకని” అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీసీ ఫుటేజ్ సహ ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని అన్నారు. రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫామ్‎హౌస్ పై శనివారం రాత్రి ఎస్‎వోటీ పోలీసులు దాడులు చేశారు. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్‎హౌస్ లో భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. 21 మంది పురుషులతో పాటు 14 మంది మహిళలను అదుపులోకి తీసుకొని డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఓ వ్యక్తికి పాజిటివ్ వచ్చింది.

పార్టీలో అనుమతి లేని విదేశీ మద్యంతో పాటు క్యాసినో పరికరాలు, ప్లేయింగ్ కార్డ్స్ లభించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని రాజ్‎పాకాల పై ఎన్డీపిఎస్, ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చేవెళ్ళ పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదు చేశారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS