Friday, November 15, 2024
spot_img

హెచ్ఐసీసీలో బీబీజీ బంగారుతల్లి‌ ఫౌండేషన్‌ వేడుకలు

Must Read

మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సినీ నటి నయన సారిక తెలిపారు. బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ (బీబీజీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నోవాటెల్ హెచ్ఐసీసీలో బీబీజీ బంగారుతల్లి‌ ఫౌండేషన్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రాథమిక స్థాయి నుంచే విద్యలో రాణించాలన్నారు. కృషి, పట్టుదల, అంకితభావంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించగలరన్నారు. బంగారు తల్లి‌ ద్వారా‌ బాలికా సాధికారతకు పాటుపడటం అభినందనీయమని తెలిపారు. అనంతరం బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ సీఎండీ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ, 2040 నాటికి రెండు మిలియన్ల మంది బాలికలకు విద్యను అందించాలన్న లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు. బంగారుతల్లి ఫౌండేషన్ బాలికా విద్యపై విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. మహిళల అభ్యున్నతి దేశ ఉన్నతికి ఎంతో అవసరమన్నారు. పేద బాలికలకు కూడా నాణ్యమైన విద్యను అందేలా‌ చేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. విద్య ద్వారా వారి కలలను సాకారం చేయనున్నామని‌ తెలిపారు. జెడ్పీహెచ్ఎస్‌ ఉపాధ్యాయురాలు జ్యోతి మాట్లాడుతూ, బిల్డింగ్ బ్లాక్ గ్రూప్, బంగారు తల్లి బృందాలకు అభినందనలు తెలిపారు. బంగారు తల్లి ప్రోగ్రామ్ బాలికలు విద్యను అభ్యసించడానికి ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఆడ పిల్లల చదువుపై తల్లిదండ్రులుకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. బీబీజీ కృషితో ఆడ పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఎదుగుతూ..సమాజంలో మార్పు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ అసోసియేట్స్ రూ.పది లక్షల చెక్కును అందజేశారు. ఈ మొత్తాన్ని బిల్డింగ్ బ్లాక్ గ్రూప్‌ సీఎండీ మల్లికార్జున రెడ్డి రెండితలు చేసి బీబీజీ బంగారు తల్లి ఫౌండేషన్‌కు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉషా తదితరులు పాల్గొన్నారు.

Latest News

గ్రూప్ 03 పరీక్షకు జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశాం

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ టీజీపీఎస్సీ ప్రతిపాదించిన ప్రతి సూచనను అధికారులు తప్పకుండా పాటించాలి 33 పరీక్షా కేంద్రాల్లో 9,478, మందికి గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ, అభ్యర్థులు ఉదయం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS