దేశంలోని ప్రముఖ పర్యాటక స్థలం తాజ్ మహల్‌ను పేల్చేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు ఉత్తర్‌ప్రదేశ్ టూరిజం ప్రాంతీయ కార్యాలయానికి మెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ బృందాలు పోలీసులతో కలిసి ముమ్మర తనిఖీలు చేశారు. అనంతరం బాంబు బెదిరింపు ఫేక్ అని అధికారులు నిర్దారించారు.
ఉత్తర్‌ప్రదేశ్ టూరిజం ప్రాంతీయ కార్యాలయానికి వచ్చిన మెయిల్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు పెరిగిపోయాయి. విమానాలు, విమానాశ్రయాలు,పాఠశాలలకు వరుసగా బెదిరింపు కాల్స్, మెయిల్స్ వస్తున్న విషయం తెలిసిందే.