పరిశీలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిరియాల గ్రామంలో జరుగుతున్న శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి విస్తృతంగా పరిశీలన చేపట్టిన ఆమె, బోనాల సందర్భంగా వేలాది మంది భక్తులు రావిరియాలకు తరలిరావడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు సమర్థంగా అందుబాటులో ఉండేలా చూడాలి,” అని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.



ఆమె ప్రత్యేకంగా జలసౌకర్యం, విద్యుత్ సరఫరా, రవాణా వసతులు, శుభ్రత, శాశ్వత మరుగుదొడ్లు, వ్యవస్థిత పార్కింగ్ వంటి అంశాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు. అధికారులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్శనలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తూ బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగేలా అధికారులు కృషి చేయాలని ఆమె సూచించారు.