Thursday, December 5, 2024
spot_img

మహా ఉత్కంఠకు బ్రేక్..డిప్యూటీ సీఎం పదవికి ఒకే చెప్పిన షిండే

Must Read

మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా బిజెపి సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. బుధవారం జరిగిన బిజెపి కోర్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ పేరుకు ఆమోదం లభించింది. రేపు మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

సీఎం పదవి వ్యవహారం కొలిక్కి వచ్చిన డిప్యూటీ సీఎం, మంత్రుల పోర్ట్ పొలియోల పంచాయితీ తేలకపోవడంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది. డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడానికి ఏక్‎నాథ్ షిండే ఆసక్తి చూపలేదు. హోంశాఖ ఇవ్వాలని కోరగా బిజెపి అధిస్థానం నో చెప్పింది. షిండే అసంతృప్తిగా ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యమైంది. దీంతో రంగంలోకి దిగిన బిజెపి పెద్దలు షిండే‎ను శాంతింపజేశారు. సీఎం అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవీస్‎ను ఎన్నుకున్నారు.

కానీ చివరి నిమిషంలో ఏక్‎నాథ్ షిండే ట్విస్ట్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పదవి తీసుకొనని షిండే తేల్చి చెప్పడంతో మహారాష్ట్ర నూతన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రంగంలోకి దిగారు. స్వయంగా అయిననే షిండే ఇంటికి వెళ్ళి చర్చలు జరిపారు. ప్రభుత్వంలో గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని నచ్చజెప్పడంతో డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు షిండే ఒప్పుకున్నారు.

రేపు మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముంబైలోని ఆజాద్ మైదానంలో ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో సహ ఎన్డీయే కీలక నేతలు హాజరుకానున్నారు.

Latest News

సమాచార హక్కు చట్టాన్ని నీరుగారుస్తున్న డాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

సిద్దిపేట జిల్లా కూనూరుపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిధుల దుర్వినియోగంపై స్పందించని డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కుకునూరు పల్లి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS