అందంగా ఉండాలన్నది ప్రతి ఒక్కరి కోరిక. కానీ అనవసరమైన ఉత్పత్తుల వినియోగంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే నిపుణుల సలహాతోనే అందాన్ని మెరుగుపర్చుకోవాలి” అని ప్రముఖ వైద్య నిపుణురాలు, బ్రిల్లర్ క్లినిక్ వ్యవస్థాపకురాలు డాక్టర్ అమ్రిన్ బాను సూచించారు. జూబ్లీహిల్స్‌లో బ్రిల్లర్ క్లినిక్ రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వేడుక అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి సినీ నటి పాయల్ రాజ్‌పుత్, ముమైత్ ఖాన్, గాయకుడు-కంపోజర్ రఘు కుంచే, రాపర్ రోల్ రిడా, బిగ్‌బాస్ సెలబ్రిటీలు హాజరై వేడుకలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా డా. అమ్రిన్ బాను మాట్లాడుతూ – “చర్మం, జుట్టు, దంత సంక్షేమం రంగాల్లో ఖచ్చితమైన వైద్యం, నిపుణుల పర్యవేక్షణలో వ్యక్తిగత అవసరాలను గుర్తించి సేవలు అందిస్తున్నాం. అందంగా ఉండాలనే ఆశయాన్ని గౌరవిస్తూ నాణ్యమైన చికిత్సలతో ప్రజల మన్ననలు పొందుతున్నాం. ఈ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను” అని పేర్కొన్నారు.