- అసెంబ్లీ స్పీకర్‌ను కోరిన బీఆర్ఎస్ శాసనసభాపక్షం
బీఆర్‌ఎస్ సభ్యులు, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై ఏకపక్షంగా విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తి వేయాలని బీఆర్ఎస్ శాసనసభా పక్షం స్పీకర్‌ను కోరింది. స్పీకర్ పట్ల సీనియర్ శాసనసభ్యుడైన జగదీశ్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సస్పెన్షన్‌పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ తరపున వివరణ కానీ, సస్పెన్షన్‌కు గురైన సభ్యుడు జగదీశ్ రెడ్డి వివరణ తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. సస్పెన్షన్‌పై నిర్ణయాన్ని పునఃపరిశీలించి సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం స్పీకర్‌కు విజ్ఞప్తి చేసింది.