- నేను పార్టీ వ్యవహారాలు మాత్రమే చూస్తున్నా
- కమిషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం డిజైన్ మార్చి, వ్యయం పెంచింది
- కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలపై కమిషన్ విచారణ చేస్తుంది
- మీడియా చిట్ చాట్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
తెలంగాణలో కేబినెట్ విస్తరణ పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన అయిన శనివారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ను కలిశారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. ఈ సంధర్బంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కమిషన్ల కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం డిజైన్ మార్చి వ్యయం పెంచారని విమర్శించారు. కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వ్యాఖ్యనించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలపై కమిషన్ విచారణ చేస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో కేబినెట్ విస్తరణపై మాట్లాడుతూ, తాను పార్టీ వ్యవహారాలు మాత్రమే చూస్తున్నానని, మంత్రివర్గ విస్తరణ పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని స్పష్టం చేశారు. బీసీ కులగణనపై వచ్చే నెలలో సమావేశం నిర్వహించాలని అనుకుంటున్నామని తెలిపారు.