ఎనుకటికి మనోళ్లు ఏ పని చేసుకుంటే
ఆ పనిని బట్టి కులం పేరు పెట్టేటోళ్లు ..
నేడు మనోళ్లు ఆ చేతి పనులు ఇడిచేసి
కులం పేరు మాత్రం గట్టిగా పట్టుకుండ్రు
ఎనుకట మనం చెప్పుకునే కులం
మన జీవన ఆధారం..మన బతుకుదెరువు
అది మనకు తిండి పెట్టేది, మనల్ని మన పిల్లలని సాకేది
నేడు నాది అని చెప్పుకునే కులం రాజకీయాలు చేస్తుంది
మన తాతల ముత్తాతల కాలంలో కులపోళ్ళంటే ముచ్చటేసేది
మనతరంలో కులమని చెప్పుకోవాలంటే రోతపుడుతుంది..
నిజానికి కులమంటే బతుకు కోరేది ..మనిషిని నిలబెట్టేది
-వాసు