20 మార్చి “ప్రపంచ ఊరపిచ్చుకల దినం” సందర్భంగా
గ్రామీణ మానవ నాగరికతతో విడదీయరాని బంధాలను పెనవేసుకున్నాయి చలాకీ బుల్లి అందాల ఊర పిచ్చుకలు. ఇంటి కిటికీలు, బాల్కనీలు, పెరటి తోటలు, పూల చెట్లు, గేట్లు, చేదబాయి, పిట్టగోడల వెంట ఉదయమే దర్శనమిస్తూ ఆ ప్రాంతాలకు శోభను చేకూర్చుతుంటాయి అందమైన ఊర పిచ్చుకలు. గ్రామీణుల కుటుంబ సభ్యుల...
తెలుగు చిత్ర సీమలో అజరామరంగా నిలిచిన అలనాటి మేటి పౌరాణిక చిత్రం భూ కైలాస్ మార్చి 20కి 67 వసంతాలు పూర్తి చేసుకుంది. నేటికీ అద్భుత చిత్ర రాజంగా తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోయింది. ఎ.వి.ఎం. సంస్థ నిర్మించిన ఎన్నో ఆణి ముత్యాల్లో అజరామరంగా నిలిచి పోయిన పౌరాణిక చిత్రం...
తెలంగాణ రాష్ట్రంలోని జరిగిన పట్టభద్రుల, టీచర్స్ ఎన్నికల్లో చెల్లని ఓట్లు ఎక్కువగా ఉండడం ఆందోళన కరమైన విషయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా పట్టభద్రుల, టీచర్స్ శాసన మండలి ఎన్నికలలో విద్యావంతులు ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసిన వారు ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు అవుతారు. విద్యావంతులే...
పారిశ్రామిక కేంద్రమైన ముంబైలో 1962లో జరిగిన రాష్ట్ర కార్మిక శాఖామంత్రుల సమావేశంలో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన ఆంశాలమీద చర్చ జరిగింది. ప్రమాదాల పట్ల కార్మికులలో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం నుండి ఒక సంస్థ అవసరమని ఆ సభలో పాల్గొన్నవారు సూచించారు. 1965 డిసెంబరు నెలలో ఢిల్లీలో జరిగిన పారిశ్రామిక భద్రత తొలి సమావేశంలో కేంద్ర,...
భారతదేశ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో షెడ్యూల్ కులాలను అట్టడుగునకు నెట్టారు. వీరంతా మానవ హక్కులు నిరాకరించబడి అస్పృశ్యత, అంటరానితనాన్ని అనుభవించారు. దళిత ఉన్నతకై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగంలో 15 శాతం రిజర్వేషన్లు కల్పించారు. షెడ్యూల్డ్ కులాల్లో 59 ఉపకులాలున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ లలో అత్యధికంగా ఉన్న కులం...
స్మార్ట్ ఫోన్ లేని వాడు నేటి డిజిటల్ యుగపు మనిషే కాడు అనే విపరీతమైన రోజులు వచ్చాయి. ఇంటర్నెట్ వాడకపోతే మానసిక దిగులు పెరుగుతుంది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లు చూడకపోతే ముద్ద దిగడం లేదు. స్మార్ట్ ఫోన్ జేబులో లేక పోతే క్షణం గడవడం లేదు. స్మార్ట్ ఫోన్‌ను ఇంట్లో మరచిపోతే ఊపిరి ఆగినంత పని...
అవిభక్త కరీంనగర్, నేటి జయ శంకర్ భూపాల్ పల్లి జిల్లాలోని మారుమూల ఆటవీ ప్రాంతమయమైన మహదేవ్ పూర్ మండలం పరిధిలోని గోదావరీ తీరస్థ అత్యంత ప్రాచీన కాశేశ్వర దేవస్థానం బహువిధ ప్రత్యేకతలకు నిలయంగా ఉంది. తెలుగు నేలపై ప్రముఖ త్రిలింగమనే పదం నుండి "తెలుగు" పదం రూపు దిద్దుకున్నడని చారిత్రక పరిశోధకుల భావన. గోదావరి...
29 జనవరి “భారతీయ వార్తాపత్రికల దినోత్సవం” సందర్భంగా
ఉదయం తలుపులు తెరవగానే వార్తాపత్రిక శుభోదయం అంటూ ముడిచుకుపోయి పలకరిస్తుంది. ప్రతి రోజు ఉదయం వార్తల విందును వడ్డిస్తుంది. దినపత్రిక చూడని రోజు ఏదో తెలియని వెలితి వెంటాడుతుంది. వార్తాపత్రిక రాని వేళ మనసు నిలవదు, దినచర్య సజావుగా సాగదు. కాఫీ చప్పరిస్తూ పేపర్ చదివితే ఆ...
ఇది నా ఇల్లే…వీళ్లు నా వాళ్ళే…అయినా నేనొంటరినే ఆ మూడు రోజులు..
నెలకోమారు మాయమయ్యే వెన్నెలలాప్రతినెల ఒంటరినై…గడప ముందు బిచ్చగత్తెలాఅంటరానిదాన్నైన ఆ మూడు రోజులు..
ఏది ముట్టకూడదు, నిషిద్దజీవిలాఎటూ కదలకూడదు, శిలలామైలపడుతుందట నేనేది ముట్టినాఅది ఆ మూడు రోజులే…
ప్రేమగా నాపై నుండి వీచే గాలి,నను కప్పిన ఆకాశంతన ఒడిలో చోటిచ్చిన నేలమైలపడవా ఆ మూడు రోజులు…
లోకోద్భవానికి…రక్తాన్ని ధారపోస్తున్నా...
జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు
24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం
11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు
కేంద్ర నిర్ణయానికి...