మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్
చట్టానికి లోబడే హైడ్రా పనిచేస్తుందని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ తెలిపారు. హైడ్రా కూల్చివేతలు, నిర్వాసితుల తరలింపు, బాధితుల ఆందోళన, తదితర అంశాల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు....
ఒకరోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, అధికారులు స్వాగతం పలికారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట పరిధిలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన...
హైదరాబాద్ లో పోస్టర్లు,బ్యానర్ల పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో పోస్టర్లు,బ్యానర్లు,కటౌట్ల పై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహీల్స్లోని అయిన నివాసంలో తనిఖీలో చేపట్టారు. హిమాయత్సాగర్ లోని పొంగులేటి ఫాంహౌస్ తో పాటు అయిన కుమార్తె, బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
కేటీఆర్
భారాస హయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టలేదని ప్రజలను మభ్యపెట్టి, ఇప్పుడు మూసీ బాధితులకు తాము నిర్మించిన డబుల్ బెడ్బెడ్ రూమ్ ఇళ్లనే కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. హైడ్రా కూల్చివేతలపై స్పందిస్తూ "ఎక్స్" వేదికగా పోస్టు చేశారు. తమ పార్టీది విధాన నిర్మాణమైతే, కాంగ్రెస్ పార్టీది విధ్వంసమని...
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యం
30 రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది
పేదలకు అతితక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందుబాటులోకి తెస్తాం
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం దుర్గాబాయి దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్...
మతపరమైన ర్యాలీల్లో డీజే వాడకంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం
డీజే శబ్ధాలు శృతిమించిపోతున్నాయని, వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సీపీ ఆనంద్ తెలిపారు. గురువారం మతపరమైన ర్యాలీల్లో డీజేల వినియోగంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని...
హైదరాబాద్లో మంగళవారం ఐటీ అధికారులు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. కూకట్పల్లి, బంజారాహీల్స్ చెక్పోస్టు, మాదాపూర్ లో ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి.ఈ సోదాల్లో మొత్తం 10 బృందాలు పాల్గొనట్టు సమాచారం. కూకట్పల్లిలోని రెయిన్బో విస్టాస్ ఐ బ్లాక్ లో నివాసముంటున్న ఓ టీవి చానెల్ యజమాని ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయ...
కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ
మాజీ మంత్రి, భారాస పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు (harish rao) పై కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే హరీష్రావు ఇంటిపై దాడి చేస్తామని హెచ్చరించారు. సోమవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతులకు రూ. 2...
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు...