Saturday, September 21, 2024
spot_img

తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కేశవరావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కేశవరావును నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడిగా వ్యవహరిస్తారని జీవోలో పేర్కొంది.ఇటీవలే అయిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

బస్సులోనే ప్రసవం,మహిళా కండక్టర్ మానవత్వం

బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. ముషీరాబాద్ డిపోకి చెందిన 1 జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆరాంఘర్ లో ఎక్కారు.బహదూర్ పూర వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి.ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ ఆర్.సరోజ...

హైదరాబాద్ చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయింత్రం హైదరాబాద్ చేరుకున్నరు.రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రజాభవన్ లో భేటీ అవుతారు.ప్రజాభవన్ లో జరిగే సమావేశంలో రాష్ట్ర విభజన,నెలకొన్న సమస్యలు,తదితర అంశాల పై చర్చిస్తారు.బేగంపేట విమానాశ్రయంలో నాయకులు,కార్యకర్తలు పెద్దఎత్తున ఘనస్వాగతం తెలిపారు.

శ్రీ జగన్నాథ రథ యాత్ర పండుగ 2024

వేదాంత చైతన్య దాస్(హైద్రాబాద్ టెంపుల్ మ్యానజ్ మెంట్ కౌన్సిల్ మెంబెర్ ఇస్కాన్ టెంపుల్ అబిడ్స్) హైద్రాబాద్, ఇస్కాన్ అబిడ్స్ టెంపుల్ ఆధ్వర్యంలో.. ఈనెల 7న జగన్నాథ్ రథయాత్ర ఘనంగా నిర్వహించబోతున్నాము. ఈ రదయాత్రను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 108ఆలయాలలో భాగవతం దానం చేయనున్నాము. ఈనెల 7న ఆదివారం NTR స్టేడియం...

తెలంగాణ సీఈవో గా సుదర్శన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా (సీఈవో) సుదర్శన్‌రెడ్డి నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుత సీఈవో వికాస్‌రాజును ఈసీ రిలీవ్‌ చేసింది.సుదర్శన్‌ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.

విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుంది

ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 7 వేల కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్ లను విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని విమర్శించారు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ.హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఝాన్సీ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో పేద,మధ్యతరగతి...

కారు దిగిన 06 మంది ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తప్పడం లేదు.ఓ వైపు క్యాడర్ ని కాపాడుకునే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉంటే,నాయకులు మాత్రం ఒక్కొక్కరిగా పార్టీను వీడుతున్నారు.తాజాగా 06 మంది ఎమ్మెల్సీలు ఒకేసారి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఎమ్మెల్సీలు భాను ప్రసాద్‌,బస్వరాజ్ సారయ్య,దండె విఠల్‌,ఎం.ఎస్‌. ప్రభాకర్‌,యెగ్గె మల్లేశం,బుగ్గారపు దయానంద్‌ కాంగ్రెస్ పార్టీలో...

నేడు హైదరాబాద్ రానున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

నేడు (శుక్రవారం) హైదరాబాద్ కి రానున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే.విభజన హామీలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు,ఇతర కీలక అంశాల పై చర్చకి రావాలని లేఖలో పేర్కొన్నారు.శనివారం జూన్ 06న భేటీ కావాలని తెలపడంతో ప్రజాభవన్...

కేశవరావుని ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తాం: సీఎం రేవంత్

కేశవరావుకి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలని అనుకుంటున్నామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం కేశవరావు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.అనంతరం ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక నుండి కేశవరావు సలహాల మేరకే రాష్ట్ర...

ఘనంగా కాంగ్రెస్ నాయకుడు ఏకాంత్ గౌడ్ జన్మదిన వేడుకలు

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఏకాంత్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.డివిజన్ నాయకులైన జితేందర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా మరెన్నో సేవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పల్నాటి అశోక్,వినోద్,సంపంగి యాదగిరి,నాగరాజు,మర్ల శ్రీను,బొట్టు శ్రీను,నాని,షాలిని,సంధ్య,నాగమణి,ఉపేంద్ర,కళ్యాణి,కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img