- ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీబిసీఐడి దర్యాప్తు చేస్తుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆదివారం విశాఖలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైసీపీ హయంలో జరిగిన పాపాలు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయని, అందుకే ఆ పార్టీ ముఖ్యనాయకులు చంద్రబాబుని తిడుతున్నారని అన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బరెడ్డి కుటుంబసభ్యులు నేరాల్లో భాగస్వాములులయ్యారని వార్తలు వస్తున్నాయి.. అందుకే సిఎం చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విశాఖ భూ ఆక్రమాణాల్లో వైసీపీ నాయకుల పాత్ర కూడా ఉందని విమర్శించారు. గంజాయి, డ్రగ్స్ ను నిర్మూలించేందుకు చంద్రబాబు ఈగల్ వింగ్ ని ఏర్పాటు చేశారని తెలిపారు.