ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సంధర్బంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళిన చంద్రబాబు దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్‌ను అందించారు.మహిళా లబ్ధిదారు ఇంటికి వెళ్ళి ఫించన్ అందజేశారు. అనంతరం ఆ కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. రేపటి నుండే ఇల్లు పనులను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కింజరావు రాంమోహన్ , రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్ననాయుడు, కొండవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.