కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు అయింది. తనపై జానీ మాస్టర్ లైంగికదాడి చేసినట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నార్సింగి పోలీసులు జానీమాస్టర్ పై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. విచారించిన కోర్టు రిమాండ్ విధించడంతో జానీమాస్టర్‌ను చంచల్‌గూడ జైలుకు పంపించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో అయినకు ప్రకటించిన నేషనల్ అవార్డును నిలిపివేస్తున్నట్లు అవార్డుల కమిటీ ప్రకటించింది. దీనికోసం జానీమాస్టర్ బెయిల్ కోరగా ఈ నెల 06 నుండి 09 వరకు అయినకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగియడంతో అయిన మళ్ళీ జైలుకు వెళ్లారు. తాజాగా మరోసారి బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.