- మూసీ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతల పై హరీష్రావు కీలక వ్యాఖ్యలు
- బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తే చూస్తూ ఊరుకోం
- కోడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసం కూడా ఎఫ్టీఎల్ లో ఉంది
- హైడ్రా బాధితుల కోసం తెలంగాణ భవన్ తలుపులు తెరిచే ఉంటాయి
మూసీ ప్రాంతంలో కూల్చివేతల పై మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పేరుతో బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మూసీ ప్రాంతంలో కూల్చివేతలు జరగకుండా అడ్డం కూర్చుంటామని, ఇళ్లను కుల్చాలంటే తమ మీద నుండి వెళ్లాలని కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కారణంగా ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటే అపన్న హస్తం కాదని, భస్మాసుర హస్తంగా మారిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు తీసేసి, బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని వ్యాఖ్యనించారు. కోడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసం కూడా ఎఫ్టీఎల్ లో ఉందని, ముందు సీఎం రేవంత్ రెడ్డి నివాసంతో పాటు, సోదరుని నివాసంను కూల్చాలన్నారు. హైడ్రా బాధితులకు ఇబ్బంది వస్తే తెలంగాణ భవన్ కి రావాలని, 24 గంటలు తలుపులు తెరిచే ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ జీవిత కాలం ఐదేండ్లు మాత్రమే ఉంటుందని, పేదల ఇళ్లు జీవిత కాలం కళ ని వ్యాఖ్యనించారు.