Saturday, April 19, 2025
spot_img

గాంధీ కుటుంబాన్ని లొంగీసుకునే కుట్రలు

Must Read
  • కక్ష్యసాధింపులో భాగంగా నెషనల్‌ హెరాల్డ్‌ కేసులో అక్రమ కేసులు
  • రాహుల్‌ కుల సర్వేకు పూనుకుంటే మోడీకి భయమెందుకు
  • అక్రమ కేసులతో గొంతునొక్కే ప్రయత్నం
  • ప్రతిపక్షాల మీద ఇప్పటికే 95 అక్రమ కేసులు పెట్టిన బీజేపీ
  • రాజకీయ స్వార్థానికి ప్రభుత్వ దర్యాప్తులను వాడుతున్న మోదీ
  • అదర్శనగర్‌ ఈడీ కార్యాలయం ముందు నిరసనలో మహేష్‌గౌడ్‌

బీజేపీకి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడుతున్న గాంధీ కుటుంబం పై అక్రమ కేసుల పెట్టి వారిని లొంగదీసుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్‌ గౌడ్‌ ఆరోపించారు. అయినా మా పేపర్‌ కి మా పార్టీ డబ్బులు ఇస్తే మనిలాండరింగ్‌ కేసు ఎలా వస్తుందో ఆర్థం కావడం లేదన్నారు. బుధవారం నాడు అదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుండి బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వరకు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో అక్రమ కేసులు బణాయించారని అన్నారు. మనీలాండరింగ్‌ కేసు అనేది కక్ష సాధింపు చర్య అని, దేశం కోసం సర్వం త్యాగం చేసిన సోనియా గాంధీ కుటుంబంపై అక్రమ కేసులను దేశ ప్రజలు క్షమించరని తెలిపారు. రాహుల్‌ గాంధీ కుల సర్వేకు పూనుకుంటే మోడీకి భయమెందుకని నిలదీశారు. అక్రమ కేసులతో దేశ ప్రజల గొంతుకను నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని, దేశంలో ప్రతిపక్షాల మీద 95 అక్రమ కేసులును కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ బనాయించిందని ఆరోపించారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలపై మోదీ రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్నారని ద్వజమెత్తారు. రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ అక్రమ కేసులకు భయపడేది లేదని, గాంధీ కుటుంబం మీద అక్రమ కేసులపై దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ.అనిల్‌ కుమార్‌ యాదవ్‌, మాజీ ఎంపీ.అంజన్‌ కుమార్‌ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Latest News

కేటీఆర్‌కు ఎంపీ చామల చురకలు

కేటీఆర్‌ ప్రధాని ట్విట్‌కు చామల కౌంటర్‌ హెచ్‌సీయూ భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు ఎక్స్‌ వేధికగా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS