Wednesday, March 12, 2025
spot_img

డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో కార్పొరేట్‌ నిర్మాణాలు

Must Read
  • నేటికీ ఖాళీ చేయని కార్పొరేట్‌ కార్మికులు
  • పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
  • గతంలో పేదలు అదే ఇళ్లలో ఉంటే తరిమేశారు
  • కార్పొరేట్‌ కార్మికులను అక్కున చేర్చుకుంటున్నారు
  • కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనైనా పేదలకు పంచుతారా.?

పేదలకు అందాల్సిన డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో కార్పొరేట్‌ నిర్మాణాలు చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు నివా సం ఉంటుంటే అధికారులు వాళ్లకు వెన్నుదన్నుగా నిలుస్తు న్నారు. సూర్యాపేట జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ నగర్‌ లో శివార్‌ లోని 349 సర్వే నెంబర్‌ లో మార్చ్‌ 2017 న రూ. 471,75 లక్షల వేయంతో 100 ఇళ్ళ నిర్మాణం కొరకు అప్పటి మంత్రి జగదీశ్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇదే విషయమై గత సంవత్సరం డిసెంబర్‌ 4వ తేదీన ఆదాబ్‌ హైదరాబాద్‌ పత్రికలో ‘‘పేదల ఇండ్లు పెద్ద(గ)ల పాలు’’ అనే వార్త కథనం ప్రచురించడం జరిగింది. కార్పొరేట్‌ చెందిన అయాన్‌ డెవలపర్స్‌ పేరుతో అపార్ట్మెంట్‌ నిర్మాణం జరుగు తుండగా, ఆ బిల్డింగ్‌ నిర్మాణం చేయడానికి వచ్చిన ఇతర రాష్ట్రాల కూలీలు, పేదల ప్రజలకు పంపిణీ చేయడానికి నిర్మాణం చేసి మధ్యలో ఆగిన డబల్‌ బెడ్రూమ్‌ ఇళ్లలో, కూలీ లకు నివాస స్థలాలుగా మారాయి. ఈ డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు నిర్మాణం 100 ఇళ్లకు అప్రూవల్‌ వస్తే, 42 ఏళ్లు మాత్రమే కాంట్రాక్టుర్‌ అసంపూర్తిగా నిర్మాణం చేసి పక్కకు తప్పుకోవడంతో నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. సంబం ధిత శాఖ అధికారులు కార్పొరేట్‌ చేతిలో కీలు బొమ్మలు గా మారి, కూలీలను ఖాళీ చేయించలేక వారికే వత్తాసు పలుకు తూ వస్తున్నారు. గత బిఆర్‌ఎస్‌ గవర్నమెంట్లో ఈ నిర్మాణాలు జరగగా, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ చొరవ తీసుకొని, మరోసారి టెండర్లకు పిలిచి అసంపూర్తిగా ఉన్న డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసి 100 మంది పేదలకు ఇల్లు అందించిన వారవుతారు. ప్రస్తుతం నిర్మాణా లు జరిగిన కొన్ని ఇళ్ళకైనా ఆ ప్రాంతంలో కనీస సౌకర్యాలు రోడ్లు విద్యుత్‌ మంచినీరు సౌకర్యం కల్పిస్తే అది ఒక కాలనీగా మారి, ఎంతోమంది పేద ప్రజల చిరునవ్వుల్లో వెలుగులు నింపుతుంది. అధికారుల నిర్లక్ష్యం మూలంగా నేడు పేదలు ఉండాల్సిన ఇళ్లలో కూలీలు నివాసం ఉంటూ కార్పొరేట్‌ శక్తులకు ఆర్థిక లాభం చేకూరుస్తున్నారు.

డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను పేదలకు ఇవ్వాలి.
సిపిఐ (ఎంఎల్‌) మాస్‌ లైన్‌ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్‌.

స్థానికంగా ఉన్న పేద ప్రజలకు డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పట్టాలు అందజేయాలి. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయకుండా ఖాళీగా ఉన్న డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఇల్లు లేని పేదలకు 74 గజాల స్థలం ఇస్తా అని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పారు. ఉన్న డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు నిర్మాణం పూర్తిచేసి పేదలకు అందించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.

Latest News

ఘ‌ట్‌కేస‌ర్ సిద్ధార్ధ కాలేజీలో ఫీజుల మోత

డబుల్ కు రెట్టింపు పెంపు అత్యల్పంగా 15%, అత్యధికంగా 30శాతం ఫీజులు పెంచుకునే ఛాన్స్ కానీ 80శాతానికి పెంపు చేసిన తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ సిద్ధార్థ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS