ఉద్యోగులు గత రెండు దశాబ్దాలుగా సామాజిక భద్రత లోపిస్తున్న, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా భారంగా మారనున్న కంట్రీబ్యూటరీ పెన్షన్స్ స్కీం విధానంపై, తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిలతో సవివరంగా వివరించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ,హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి, ఉద్యోగుల భవితను భద్రత చేకూర్చాయన్నారు. రాజస్థాన్ లో 1000కి పైగా రిటైర్ అయిన సీపీఎస్ ఉద్యోగులు పాత పెన్షన్ విధానాన్ని తీసుకుంటున్నారని తెలిపారు. పాత పెన్షన్‌తో రాష్ట్రానికి ఆర్థిక భారం లేదని, పైగా ఇప్పటివరకు సిపిఎస్ ఉద్యోగుల తమ ఎన్.పి.ఎస్ ట్రస్ట్‌లో ఉన్న పెన్షన్ నిధి రాష్ట్రానికి వస్తుందని అన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తే ఎల్బీ స్టేడియంలో 2,00,000 కుటుంబాలతో ధన్యవాదాలు తెలియజేస్తామని పేర్కొన్నారు.