గాయం కారణంగా టోర్నీకి దూరమైన గుర్జప్‌నీత్
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు అదిరే న్యూస్. గాయం కారణంగా టోర్నీకి దూరమైన పేసర్ గుర్జప్‌నీత్ సింగ్‌కు రిప్లేస్‌మెంట్ ప్రకటించింది. అతడి స్థానాన్ని సౌతాఫ్రికా 21 ఏళ్ల యంగ్ బ్యాటర్ డివాల్డ్ బ్రెవిస్ భర్తీ చేయనున్నట్లు వెల్లడిరచింది. బ్రెవిస్‌ను చైన్నై రూ.2.2 కోట్ల ధరకు తీసుకుంది. దీంతో ప్రస్తుత సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు బ్రెవిస్ చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 81 టీ20లు ఆడిన బ్రెవిస్ 1787 పరుగులు చేశాడు. ఇందులో 162 స్కోర్ అత్యధికం. ఇక 2022లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన బ్రెవిస్ మూడు సీజన్లలో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో మొత్తం 10మ్యాచ్ ఆడిన ఈ యంగ్ డైనమిక్ 230 పరుగులు చేశాడు. టీ 20ల్లో దూకుడుగా ఆడడం బ్రెవిస్ స్పెషాలిటీ. క్రీజులో ఉన్నంతసేపు ధనాధన్ షాట్లతో అలరిస్తుంటాడు. దీంతో ఈ చిచ్చర పిడుగు బ్రెవిస్‌కు ‘బేబీ ఏబీడీ’ అనే పేరు వచ్చింది. బ్రెవిస్ రాకతో చెన్నై జట్టు బ్యాటింగ్ బలం పెరగనుంది. అటు ఫ్యాన్స్ కూడా హ్యీపీగా ఫీలవుతున్నారు. ఇకపై ఆడనున్న మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించాలని ఆశిస్తున్నారు. అయితే గతేడాది జరిగిన మెగా వేలంలో డివాల్డ్ బ్రెవిస్‌ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు. దీంతో ఈ యంగ్ స్టర్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. తాజాగా గుర్జప్‌నీత్ సింగ్ గాయంతో దూరం కాగా, బ్రెవిసకు మళ్లీ ఐపీఎల్ అడే ఛాన్స్ దక్కింది. అయితే రిప్లేస్‌మెంట్‌లో బ్రెవిస్‌ను తీసుకోవాలన్నది ధోనీ ఆలోచన అని తెలుస్తోంది! కాగా, చెన్నై తమ తదుపరి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ను ఢీ కొట్టనుంది. ఆదివారం (ఏప్రిల్ 20) వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుత ఐపీఎల్‌లో చెన్నై పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడగా, అందులో సీఎస్కే రెండే విజయాలు నమోదు చేసింది. ఫలితంగా 4 పాయింట్లతో పట్టికలో అట్టడుగు (10వ స్థానం)లో ఉంది. ఈ సీజన్‌లో చెన్నై ఇప్పటికే సగం మ్యాచ్‌లు ఆడేసింది. ఇక ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే ఇకపై ఆడనున్న ఏడు మ్యాచ్‌ల్లో కనీసం ఆరింట్లో నెగ్గాల్సిందే!