Sunday, September 7, 2025
spot_img

రెపో రేట్‌ కోతపై రేపే నిర్ణయం

Must Read

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2025కి గాను 3వ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను నిన్న (జూన్ 4న బుధవారం) ప్రారంభించింది. ఇవాళ, రేపు కూడా జరగనున్న ఈ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను రేపు (జూన్ 6న శుక్రవారం) వెల్లడించనున్నారు. గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.

ఈసారి ద్రవ్య సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు, కుదిరితే 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే గత 2 ద్రవ్య సమీక్షల్లో (ఫిబ్రవరి, ఏప్రిల్‌) రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్ల చొప్పున మొత్తం 50 బేసిస్‌ పాయింట్లు కోత పెట్టింది. దీంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. ఈ ఏడాది జరిగే మరో 3 ద్రవ్య సమీక్షల్లోనూ వడ్డీ రేట్ల తగ్గింపులకు అవకాశం ఉందని ఆర్థిక, బ్యాంకింగ్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This