Thursday, April 24, 2025
spot_img

ప్లేఆఫ్స్‌ రేసులో ముందంజలో ఢిల్లీ

Must Read

ఈ సీజన్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ దూసుకెళ్తోంది. లక్నో సూపర్‌ జియాంట్స్‌ను చిత్తుగా ఓడించి మరో ఘన విజయాన్ని ఢిల్లీ ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్‌ రేసులో ముందంజలో నిలిచింది. అంచనాలకు మించి రాణిస్తూ అత్యంత విజయవంతమైన జట్టుగా ఈ సీజన్‌లో గుర్తింపు పొందుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లక్నో సూపర్‌ జియాంట్స్‌ను ఢిల్లీ మట్టికరిపించింది. అతి తక్కువ స్కోర్‌ నమోదైన మ్యాచ్‌ను సునాయాసంగా ఢిల్లీ మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. అభిషేక్‌ పరేల్‌, కేఎల్‌ రాహుల్‌ చక్కటి భాగస్వామ్యంతో ఢిల్లీకి కీలక విజయం దక్కింది. లక్నోను 13 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో ఢిల్లీ మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌ జియాంట్స్‌ అతికష్టంగా 159 పరుగులు చేసింది. అది కూడా ఆరు వికెట్ల నష్టానికి కావడం గమనార్హం. ఐడెన్‌ మర్‌క్రమ్‌, మిచెల్‌ మార్ష్‌ మినహా మిగతా బ్యాటర్లు భారీ స్కోర్‌ చేయలేకపోయారు. 33 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సర్లతో మర్‌క్రమ్‌ 52 పరుగులు చేయగా.. 36 బంతుల్లో 45 పరుగులు మార్ష్‌ చేశాడు. ఆఖరులో ఆయూశ్‌ బదౌనీ 36 పరుగులతో రాణించడం కారణంగా జట్టు గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది.

పూరన్‌ (9), అబ్దుల్‌ సమద్‌ (2), డేవిడ్‌ మిల్లర్‌ (14) తక్కువ పరుగులకే ఔటవగా.. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ డకౌట్‌ కావడం గమనార్హం. ఢిల్లీ బౌలర్లు లక్నో బ్యాటర్లను చెడుగుడు ఆడేసుకున్నారు. ఎవరూ కూడా భారీ ఇన్నింగ్స్‌ చేయడానికి బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని తక్కువ పరుగులకు పరిమితం చేశారు. ముకేశ్‌ కుమార్‌ నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థిపై ప్రకోపం చూపాడు. చమీరా, మిచెల్‌ స్టార్క్‌ తలా ఒక్కో వికెట్‌ పడగొట్టారు.అతి తక్కువ లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాటర్లు ఉఫ్‌ అని ఊదేశారు. 17.5 ఓవర్లకు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 161 పరుగులు సాధించింది. కరుణ్‌ నాయర్‌ 15 పరుగులకే పరిమితమవగా.. అభిషేక్‌ పరేల్‌, కేఎల్‌ రాహుల్‌ చక్కటి భాగస్వామ్యంతో జట్టుకు విజయాన్ని అందించారు. అభిషేక్‌ 36 బంతుల్లో 51 పరుగులు చేసి సత్తా చాటగా.. 42 బంతుల్లో 57 స్కోర్‌ను కేఎల్‌ రాహుల్‌ నమోదు చేశాడు.

కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ చక్కటి భాగస్వామ్యాన్ని రాహుల్‌తో నెలకొల్పుతూనే 34 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. భారీ స్కోర్‌ చేయలేక బ్యాటర్లు విఫలమవగా.. వికెట్లు తీయలేక లక్నో సూపర్‌ జియాంట్స్‌ బౌలర్లు తుస్సుమనిపించారు. ఐడెన్‌ మర్‌క్రమ్‌ 2 వికెట్లు మాత్రమే తీసి సత్తా చాటాడు.ప్లేఆఫ్స్‌ దశకు సమయం ముంచుకొస్తుండడంతో జట్లు తమ ప్రదర్శనపై భారీ వ్యూహలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ అదరగొడుతూ తాజా మ్యాచ్‌ విజయంతో ఆరు గెలుపులను ఖాతాలో వేసుకుంది. ఆడిన 8 మ్యాచుల్లో రెండు పరాజయం పొందింది. లక్నో సూపర్‌జియాంట్స్‌ మ్యాచ్‌లు తగ్గిపోతుండగా జట్టు మాత్రం ముందుకుపోనంటోంది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 4 ఓటములు పొందగా.. ఐదు విజయాలను అందుకుంది. తాజా మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా తర్వాతి మ్యాచ్‌ల్లో అదరగొడతామని లక్నో ఆటగాళ్లు చెబుతుండగా.. మరికొన్ని విజయాలు తోడయితే లక్నోను ఎవరూ ఆపేతరం కాదు.

Latest News

ప్రభుత్వ బడి ముద్దు.. ప్రైవేటు బడి వద్దు

ఆత్మకూరు (ఎం) మండల పరిధిలోని పల్లెర్ల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సోమయ్య మరియు బోధన సిబ్బంది బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS