- లక్నోపై ఒక వికెట్ తేడాతో ఢిల్లీ విజయం
- మార్ష్ కళ్లు చెదిరే బ్యాటింగ్
నరాలు తెగే ఉత్కంఠగా విశాఖపట్టణంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. విజయంపై ధీమాగా ఉన్న లక్నోను అశుతోష్ చావుదెబ్బ తీశాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో ఓటమి ఖరారు అనుకున్న మ్యాచ్ ఒక్కసారిగా తిప్పి పడేశాడు. తీవ్ర ఉత్కంఠ కలిగించిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం చేసింది. మార్ష్ కళ్లు చెదిరే బ్యాటింగ్.. పూరన్ పూనకాలతో బ్యాటింగ్‌లో దుమ్మురేపినా కూడా అవి వృథా అయ్యాయి. లక్నోపై ఒక వికెట్ తేడాతో ఢిల్లీ విజయం సాధించి అబ్బుపరిచింది. విశాఖపట్టణంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 30 బంతుల్లో 75 స్కోర్ అత్యంత వేగంగా పరుగులు రాబట్టగా.. మిచెల్ మార్ష్ అదే స్థాయిలో 36 బంతుల్లో 72 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి ఒకదశలో జట్టుకు భారీ స్కోర్ అందిస్తారని అందరూ భావించారు. మెగా వేలంలో అత్యధిక ధరతో రికార్డులు తిరగరాసిన రిషబ్ పంత్ డకౌట్ కావడం అందరినీ షాక్‌కు గురి చేసింది. డేవిడ్ మిల్లర (27), మర్‌క్రమ్ (15) కొంత పరుగులు జోడిరచారు. భారీగా పారుతున్న లక్నో పరుగులకు ఢిల్లీ బౌలర్లు కళ్లెం వేశారు. మిచెల్ స్టార్ 3 వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. ముకేశ్ కుమార్ ఒక వికెట్ తీయగా.. అరంగేట్ర బౌలర్ విప్రజ్ నిగమ్ ఒక వికెట్ తీయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కెప్టెన్ అక్షర్ పటేల్ ఒక వికెట్ కూడా తీయలేదు.