ధోనీ నేను స్నేహితులం కాదు.. మా ఇద్దరి మధ్య మాటల్లేవ్ అంటూ భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇద్దరి మధ్య మాటలు లేక 10 సంవత్సరాలు దాటిందని తెలిపాడు.ధోనీ నాతో మాట్లాడడం లేదు, దానికి కారణం ఎంతో నాకు తెలియదు..నేను ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నప్పుడు మేము మాట్లాడుకున్నాము..అది కూడా మైదానం వరకే పరిమితం..అతను నా గదిలోకి రాలేదు..నేను ధోనీ గదిలోకి వెళ్లలేదు అని హర్భజన్ తెలిపాడు.