- పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యం
- 30 రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది
- పేదలకు అతితక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందుబాటులోకి తెస్తాం
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం దుర్గాబాయి దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,మరో 30 రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. వీలైనంత వరకు పేదలకు అతితక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందుబాటులోకి తెస్తామని అన్నారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయబోతున్నామని తెలిపారు. దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నిర్ణయాలతోనే దేశ వైద్య రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నయని పేర్కొన్నారు.