Thursday, December 12, 2024
spot_img

అలైన్మెంట్ చేంజ్‎లో దివీస్ మేనల్లుడి హస్తం

Must Read
  • రూ.30కోట్ల బేరానికి గెస్ట్ హౌస్‎కి వెళ్లిన అధికారులు.?
  • రైతుల ప్రయోజనాలు దెబ్బతీసిన దివీస్ సుధాకర్
  • దివీస్ ప్రయోజనాల కొరకు అలైన్మెంట్ మార్పు : మాజీ ఎంపీ బూర నర్సయ్య
  • అధికారులు, సుధాకర్ మధ్య జరిగిన ఆర్థిక వ్యవహారాలపై నిగ్గు తేల్చాలి..
  • ఎన్నో ఏళ్లుగా దివీస్‎తో కుమ్మక్కువతున్న అధికారులు
  • చౌటుప్పల్ ప్రజల ప్రయోజనాలు దెబ్బతీస్తున్న సుధాకర్
  • ట్రిపుల్ఆర్ లో మార్పులపై రైతులు ఆగ్రహం..
  • అధికారులు, సుధాకర్ గెస్ట్ హౌస్‎లో చేసిన అలైన్మెంట్
    మార్చాలని డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని లింగోజిగూడెం వద్ద ఉన్న డివీస్ ల్యాబోరేటరీస్ ఏది తలుచుకుంటే అదీ చేసి తీరుతుంది. దాని కోసం ఎంత ఖర్చైనా పర్లేదు. ప్రభుత్వ పెద్దలు, పొలిటికల్ లీడర్లు, ఉన్నతాధికారులు, సంబంధిత సిబ్బంది ఇలా ఎవరినీ ఇడిసి పెట్టదు. వారినీ మచ్చిక చేసుకొని కావాల్సినంత డబ్బు వెదజల్లి దర్జాగా వ్యాపారం సాగించుకుంటది. తనకు ఎవరూ అడ్డొచ్చిన దానికి ప్రత్యామ్నాయం వెతుక్కొని ఆ రూట్ (రాంగ్) లో వెళ్తే పరిష్కారం అవుద్దో ముందే చూసుకుంటుంది. కోట్లు ఖర్చు చేసి అయినా తన వంతమే నెగ్గాలి అన్నట్టు వ్యవహరిస్తుంది. ఇందుకు ఉదాహరణే యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల రైతులు, గీత కార్మికులు, స్థానిక ప్రజలు దివీస్ కంపెనీ ద్వారా వెలువడే వ్యర్థ పదార్ధాల ద్వారా సర్వం నాశనం అవుతున్నా ఏ అధికారిని అటువైపు రానివ్వకుండా మేనేజ్ చేస్తుంది. దివీస్ ద్వారా వెలువడే విష వ్యర్థాలు వల్ల నీరు, వాతావరణ కాలుష్యం అవుతుందని రైతులు, గీతకార్మికులు, స్థానిక ప్రజలు ఆందోళన చేస్తూ వస్తున్నారు. గత కొంత కాలంగా దివీస్ ఫార్మా వల్ల తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నట్లు దివీస్ వదిలే వ్యర్ధాల వల్ల నీళ్లు కలుషితం కావడం, వ్యవసాయ పంటలు పాడైపోవడం, కల్లు గీత కార్మికుల ఉపాధి కోల్పోతున్నామని కోర్టులు, ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, అధికారులు వద్దకు వెళ్లిన సమస్య పరిష్కారం కావడం లేదు. ఈ క్రమంలో ‘చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు’ అయింది రైతుల పరిస్థితి. రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ చుట్టూ ఇప్పటికే ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్డు) ఉంది.. భాగ్యనగరం బాగా డెవలప్ కావడంతో సిటీలో జనాభా, వ్యాపారం పెరగడం మూలంగా రాకపోకలు ఎక్కువయ్యాయి. ఇందులో భాగంగా ఔటర్ రింగురోడ్డుకు రోజురోజుకు వాహనాల రద్దీ బాగా పెరిగిపోయింది. కాగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) 50 కిలోమీటర్ల దూరం లోపల.. మరో బాహ్యవలయ రహదారి రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ఆర్) నిర్మించబోతున్నారు. ట్రిపుల్ ఆర్ పేరుతో దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మాణం చేపడుతున్నాయి. బ్యాహవలయ రహదారి రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి (బీఆర్ఎస్ సర్కార్) గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ద్వారాః భూసేకరణకు సంబంధించి అలైన్మెంట్ రూపొందించడం జరిగింది.

దివీస్ ప్రయోజనాల కొరకే అలైన్మెంట్ మార్పు :

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అలైన్మెంట్ లో ప్రస్తుతం అసుకోని మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పుడు భూసేకరణ చేసే సమయంలో దివీస్ ల్యాబ్స్ యాజమాన్యం తమ మేలు కోసం మాయ చేసింది. దివీస్ పరిశ్రమ చైర్మెన్ మేనల్లుడు డివీస్ కంపెనీ జనరల్ మేనేజర్ అయిన సుధాకర్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సమయంలో భూసేకరణ చేసే అధికారులను డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భూసేకరణలో దివీస్ ల్యాబ్స్ పరిశ్రమ ఏ విధంగా ఎఫెక్ట్ కాకుండా చూడాలని ఆదేశించారు. ట్రిపుల్ఆర్ భూసేకరణలో భాగంగా దివీస్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులతో బేరసారాలు కుదుర్చుకున్నాడు. అయితే కుట్రను పసిగట్టిన రైతులు.. దివీస్ ల్యాబ్స్ చైర్మెన్ మేనల్లుడు సుధాకర్ తమ ప్రయోజనాలు దెబ్బ తీసారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణకు సంబంధించి అలైన్మెంట్ ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే మునుగోడు ఉప ఎన్నికలు వచ్చాయి. ట్రిపుల్ ఆర్ లో దివీస్ ల్యాబ్స్ పరిశ్రమ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని భూసేకరణ చేస్తున్న అధికారులకు భారీగా ముడుపులు అందినట్లు ప్రచారం అవుతుంది. భూసేకరణ పరిశీలన చేస్తున్న అధికారులు ఈ టైంలో దివీస్ గెస్ట్ హౌస్ కు ఎందుకు వెళ్లారు అన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న. అధికారులు దివీస్ కంపెనీ గెస్ట్ హౌస్ కు వెళ్లి ఛైర్మెన్ మేనల్లుడు సుధాకర్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీకి రూ.30 కోట్లు :

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా దివిస్ ల్యాబ్స్ జనరల్ మేనేజర్ సుధాకర్ ద్వారా గతంలో అధికార పార్టీకి రూ.30 కోట్లు దివిస్ గెస్ట్ హౌస్ నుండి పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉప ఎన్నికలలో దివిస్ ల్యాబ్స్ అధికార పార్టీకి కోట్లాది రూపాయలు ఇస్తున్నారని పోటీ చేసిన అభ్యర్థుల ఫిర్యాదుతో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు.. దీవిస్ ల్యాబ్స్ పరిశ్రమలో సోదాలు జరిపినట్లు అప్పట్లో పత్రికలు, న్యూస్ ఛానళ్లలో వార్తలు కూడా వచ్చాయి. ఐ.టి దాడులు జరిగింది అందుకేనా విచారణ జరపాలనే డిమాండ్ వ్యక్తం అవుతుంది. ఇదీలా ఉండగా రీజినల్ రింగ్ రోడ్ లో
(ట్రిపుల్ఆర్) దివిస్ ల్యాబ్స్ దగ్గరలో ఎటువంటి భూసేకరణ చేయకుండా సహకరించడానికి ఉప ఎన్నికలలో అధికార పార్టీకి గత ప్రభుత్వ పెద్దలతో కుదిరిన ఒప్పందం ప్రకారమే దివిస్ గెస్ట్ హౌస్ ద్వారా డబ్బు సరఫరా అయిందని ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయాన్ని చౌటుప్పల్ మండలంలోని సన్నిహితుడైన ఒక ఫార్మాసూటికల్ ఏజెన్సీ ఓనర్ తో సుధాకర్ చెప్పినట్లు చౌటుప్పల్ లో అలైన్మెంట్ నుండి డివీస్ కు మినహాయింపు ఇచ్చారని అధికారులు దివీస్ దరిదాపులోకి కూడా రారని సుధాకర్ చెప్పినట్లు చౌటుప్పల్ లో చర్చించుకుంటున్నారు.

దివిస్ సుధాకర్ పై అన్నదాతల ఆగ్రహం:
గత ప్రభుత్వ పెద్దలతో బేరసారాలు కుదుర్చుకొని ముందుగా అధికారులు నిర్ణయించిన అలైన్మెంట్ దివీస్ పరిశ్రమకు దగ్గరగా ఉండటంతో రంగంలోకి దిగిన సుధాకర్ అలైన్మెంట్ ముందు నిర్ణయించిన దానిని మార్చి ప్రస్తుతం చేపడుతున్న భూసేకరణకు అనుగుణంగా మార్చడానికి అధికారులు కుమ్మక్కు కావడం వల్లనే ఏళ్ల తరబడిగా మాకు బతుకు దెరువు చూపిన భూములను తక్కువ ధరకు భూసేకరణకు తీసుకోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దివీస్ చైర్మెన్, అతని మేనల్లుడు మరియు చౌటుప్పల్ ప్లాంట్ ఇంచార్జ్ జనరల్ మేనేజర్ పి.సుధాకర్ కారణం అని రైతులు కలెక్టర్ ఆఫీస్, రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. నిరసనలో రైతులు అలైన్మెంట్ మార్చడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా దివీస్ సుధాకర్ ప్రధాన కారణమని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీవిస్ ప్రయోజనాల కొరకే అలైన్మెంట్ మార్పు: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ :

రీజినల్ రింగ్ రోడ్ భూములు కోల్పోతున్న రైతులు చేపట్టిన ధర్నాకు భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ మద్దతు ప్రకటించారు. భూములు కోల్పోతున్న రైతుల పక్షాన అండగా ఉంటామని ఆయన చెప్పారు. ముందుగా నిర్ణయించిన అలైన్మెంట్ ను మార్చింది కేవలం దివీస్ ల్యాబ్స్ ప్రయోజనాలు కోసమేనని బూర నర్సయ్య ఆరోపించారు. రైతుల ప్రయోజనాలు దెబ్బ తీయడానికేనని గతంలో ఉన్న అధికార పార్టీతో దివీస్ సుధాకర్ సత్సంబంధాలు కలిగి ఉన్నారని అధికారులు కార్పొరేట్ యాజమాన్యంతో కుమ్మక్కై రైతుల ప్రయోజనాలు దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపడుతున్నందున భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని బూర నర్సయ్యగౌడ్ భూములు కోల్పోతున్న రైతులకు భరోసా ఇచ్చారు.

Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS