- దివిస్ కాలుష్యంఫై ప్రజల్లో అవగాహన కల్పించిన పలు పత్రికలు..
- దివిస్ కాలుష్యం ఆధారంగానే అంబుజా సిమెంట్ పై ప్రజా ఉద్యమం..
- బాపు ఘాట్ వ్యర్థాలను మూసీలోకి వదులుతున్న మాఫియా గుట్టు రట్టు
- దివీస్ వ్యర్థాల తరలింపుపై నిఘూ పెట్టి ట్యాంకర్ ను పట్టుకున్న జర్నలిస్టులు
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ పరిధిలో గల దివిస్ ల్యాబరేటరీస్ పరిశ్రమ అక్కడి ప్రజల పాలిట మృత్యువులా మారిపోయింది. అక్కడి స్థానిక ప్రజలకు తెలంగాణ యువతకు దివిస్ ల్యాబరేటరీస్ పరిశ్రమ ఏలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించక పోగా, గత ఇరవై సంవత్సరాలుగా వ్యర్థాలను నిబంధనల ప్రకారం శుద్ది చేయవలసి ఉండగా, నేరుగా భూగ “ర్భంలోకి విడుదల చేయడంతో పరిసర గ్రామాలలో భూగర్భ జలాలు కలుషితమై వ్యవసాయానికి, గృహ అవసరాలకు పనికి రాకుండా పోయాయి. దాంతో గత ఇరవై నాలుగు సంవత్స రాలుగా కాలుష్యం తో దివీస్ ల్యాబ్స్ పరిసర గ్రామాల ప్రజలు నివాసం చేస్తూ తీవ్ర అనారోగ్యానికి గురి అవుతూ.. తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.. దాంతో స్థానిక రైతులు, గీత కార్మికులు, పర్యావరణ సామాజిక కార్యకర్తలు కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర జోనల్ ప్రాంతీయ కార్యాలయాలకు వందల సంఖ్యలో పిర్యాదలు చేసిన న్యాయం జరగకపోవడంతో.. తెలంగాణ హై కోర్ట్ లో జాతీయ హరిత ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు లో దివీస్ ల్యాబ్స్, కాలుష్యం పై పదుల సంఖ్యలో రైతులు గీత కార్మికులు పర్యా వరణ సామాజిక కార్యకర్తలు కేసులు వేయడం జరిగింది. వీటిలో కొన్ని కేసులలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తప్పుడు నివేదికలు ఇవ్వడంతో బాధితులకు న్యాయం జరగలేదు.
దివిస్ కాలుష్యంపై తెలంగాణ ప్రజలలో ఆదాబ్ అవగాహన :
పంతంగి, తంగడపల్లి, లింగోజిగూడె లోని రైతులు పంటలు పండక పెట్టిన పెట్టుబడులు రాక లక్షలాది రూపాయలు ఆర్థికంగా నష్ట పోయిన సమస్యలపై ఆదాబ్ పత్రిక వరుస కథనాలు ప్రచురించింది.. తెలంగాణ రాష్ట్రంలో దివిస్ లాంటి పరిశ్రమల కారణంగా కాలుష్యం ఏ స్థాయిలో పెరుగుతుందో .. ప్రజలు, రాబోవు తరాలు ఎలా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో.. పడుతారో…. భవిష్యత్ ఎంత భయానకంగా ఉంటుందో తెలంగాణ ప్రజలకు కళ్లకు కట్టినట్లు తెలిసేలా చేసిన ఘనత ఆదాబ్ హైదరాబాద్ పత్రికది
దివిస్ దెబ్బకు “లగచర్ల ఇథానల్ పరిశ్రమ “ఫార్మాసిటీ” అంబుజా సిమెంట్ పరిశ్రమల అనుమతుల రద్దు :
దివిన్ ల్యాబ్స్ పరిశ్రమ కాలుష్యంతో ఇబ్బందులు ఏ స్థాయిలో ఉంటాయో తెలుసుకున్న తెలంగాణ ప్రజలు పరిశ్రమల ఏర్పాటు అంటనే గజ గజ వణికి పోతున్నారు. దీవిస్ వంటి పరిశ్రమల గురించి అవగాహన పెంచుకున్న రామన్నపేట ప్రజలు రామన్న పేటలో అదానీ గ్రూప్ 1400 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసే సిమెంట్ గ్రైండింగ్ పరిశ్రమను మండల ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి పరిశ్రమ ఏర్పాటును అడ్డుకున్నారు. వికారాబాద్ జిల్లాలో కోడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే ఫార్మా సిటీ ఏర్పాటును కూడా కాలుష్య కారణంగానే ప్రజలు అడ్డుకున్నారు..
యం.యస్ అగర్వాల్ పరిశ్రమ తరలించాలని ధర్నా :
దివిస్ ల్యాబ్స్ కాలుష్యంతో ప్రజలు రైతులు ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారో తాము కూడా అదే పరిస్థితి గత పదేండ్లుగా అనుభవిస్తున్నామని యం.యస్ అగర్వాల్ పరిశ్రమ పరిసర గ్రామాల ప్రజలు MS అగ్రవాల్ స్టీల్ కంపెనీ ముందు గ్రామస్థుల ధర్నావ్యక్తం చేస్తున్నారు.. ఇక్కడి పరిశ్రమల కారణంగా వాయు, జల, శబ్ద కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని గమనించిన యం.యస్ ఆగర్వాల్ పరిసర గ్రామాల ప్రజలు మహిళలు రైతులువందల సంఖ్యలో మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని పరిశ్రమను మూసి వేయాలని కోరుతూ ధర్నా చేసి అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
దీవిస్ ట్యాంకర్ పట్టుబడటంతో బాపు ఘాట్ వాసుల నిఘా గుట్టు రట్టు :
అబ్దుల్లాపూర్ మెట్ వద్ద దివిస్ ల్యాబ్స్ ట్యాంకర్ పట్టుబడడంతో దివీస్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. హైదరాబాద్ లోని త్రివేణి సంగమం వద్ద బాపు ఘాట్ దగ్గరలో గల మూసీలోకి ఫార్మా కెమికల్ వ్యర్థాలను అక్రమంగా తీసుకువస్తున్నారని గమనించిన అయ్యప్ప స్వాములు, పలువురు జర్నలిస్టులు గుట్టుగా ట్యాంకర్ల ద్వారా వ్యర్థాలు తీసుకువచ్చి మూసీలోకి వదులుతున్న ట్యాంకర్లను నిఘూ వేసి పట్టుకున్నారు.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద యెత్తున ఫార్మా కెమికల్ పరిశ్రమల నుండి వందల సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా తెచ్చి బాపు ఘాట్ వద్ద మూసీలోకి పంపుతున్న కెమికల్ మాఫియా గుట్టు రట్టు అయింది. లగుచర్ల ఫార్మాసిటీ,ఇధనాల్ పరిశ్రమ, అంబుజ సిమెంట్ పరిశ్రమ, యం.యస్ అగర్వాల్,బాపు ఘాట్ కెమికల్ మాఫియా లాంటి పరిశ్రమల ఆగడాలకు అడ్డుకట్ట పడే విధంగా కథనాలు ప్రచురించి ప్రజల్లో చైతన్యం నింపిన ఘనత పత్రికలదే..
దివిస్ ల్యాబ్స్ పరిశ్రమ కాలుష్యం పై గత ఏడాది కాలంగా ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో వార్తలు కోకొల్లలుగా ప్రచురితమవుతున్నాయి.. ముఖ్యంగా తెలంగాణ ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై అక్షర రూపంలో నిరంతరం పోరాటం చేస్తున్న “ఆదాబ్ “హైదరాబాద్ పత్రిక యాజమాన్యం కూడా దీవిస్ ల్యాబ్స్ కాలుష్యం పై కొన్నెండ్లుగా అలుపెరగని పోరాటం చేస్తుంది.. గత పదిహేను సంవత్సరాలుగా దివిస్ ల్యాబ్స్ కాలుష్యంతో, వ్యర్థాలతో గీత వృత్తిని నమ్ముకున్న గీత కార్మికులు సుమారు 1200 కుటుంబాలు ఉపాధి కోల్పోయారు.. అంతేకాకుకుండా వందల కుటుంబాలు ముఖ్యంగా అరెగూడం,