రైతులపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. సోమవారం లగచర్లలో జరిగిన ఘటనపై అయిన స్పందించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, రైతుల ఇష్టప్రకారమే భూసేకరణ జరగాలని తెలిపారు. రైతుల భూములను ఫార్మా కంపెనీలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. లగచర్ల రైతుల మీద కేసులు పెడితే యావత్తు తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు. రైతుల భూములు గుంజుకోవద్దని ఎన్నిసార్లు మొరపెట్టుకున్న వినకుండా, రైతుల భూములను ఫార్మా కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కొడంగల్ చుట్టూపక్కల మండలాల్లో ఇంటర్నెట్ సేవలను బంద్ చేసి, వందల మంది పోలీసులు గ్రామాలలో మోహరించి..అరెస్ట్ చేయడాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.