Friday, November 15, 2024
spot_img

రియల్‌ ఎస్టేట్‌ నేలచూపు

Must Read
  • గ్రేటర్‌ సిటీలో రియల్‌ ఎస్టేట్‌ బిజినేస్‌ జీరో
  • గతేడాది ఆగస్టు నుంచి పడిపోయిన వ్యాపారం
  • హైడ్రా ఎఫెక్ట్‌ తో కొనుగోలుదారుల్లో గుబులు
  • గత ప్రభుత్వ హయాంలో భారీగా పెరిగిన భూముల ధరలు
  • క్రయ, విక్రయాలు చేసే కమీషన్‌ దారుల పరిస్థితి దయనీయం
  • రియల్‌ ఎస్టేట్‌ను నమ్ముకున్న అన్ని రంగాలు దివాలా
  • సేల్స్‌ లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో బిల్డర్స్‌ అండ్‌ పెట్టుబడిదారులు
  • ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది
  • భవన, నిర్మాణ రంగంలో నిరుద్యోగులకు ఉపాధి
  • నేడు రియల్‌ ఎస్టేట్‌ రంగం పడిపోవడంతో రోడ్డున పడ్డ అభాగ్యులు

తెలంగాణ రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం పూర్తిగా పడిపోయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ తో పాటు జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లోనూ రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌ అన్నది. రియల్‌ వ్యాపారంలో బిజినెస్‌ లేక ఆ రంగాన్ని నమ్ముకొని బతికే వారి పరిస్థితి దయనీయంగా మారింది. గతమెంతో ఘనం అన్నట్టుగా హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం తయారైంది. గతంలో భాగ్యనగరం దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో సైతం మారుమ్రోగుతోంది. ప్రధానంగా రియల్‌ ఎస్టేట్‌ పరంగా హైదరాబాద్‌ సిటీ దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతూ దూసుకెళ్తోంది. దేశంలోని దిగ్గజ రియల్‌ ఎస్టేట్‌ నగరాలైన ముంబై, ఢల్లీి, పుణె, బెంగళూరు, చెన్నై నగరాలను పక్కన నెట్టి హైదరాబాద్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ క్రమంలోనే పట్నంలో భూములు, ఇండ్ల ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. ఒకానొక సమయంలో గత ప్రభుత్వ హయాంలో రియల్‌ స్టేట్‌ అమాంతం ఊపందుకుంది. రికార్డు స్థాయిలో కోకాపేటలో ఎకరం భూమి రూ.100 కోట్లకు పైగా పలికింది. ఒక్క కోకాపేట కాదు ఇలాంటి డీల్స్‌ చాలానే జరిగాయి.

ఈ క్రమంలోనే ఇండ్లు, ప్లాట్ల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఫామ్‌ హౌస్‌ లు, విల్లాలు, అపార్ట్‌ మెంట్లలో ప్లాట్స్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ రంగం పడిపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పెట్టుబడి కోసం భూములు, ప్లాట్స్‌ కొన్న వారి దారుణంగా తయారైంది. లక్షలు, కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన భూములు, ప్లాట్లను కొనుగోలు చేసి డబ్బులు పెట్టిన పెట్టుబడిదారులు దిగాలు చెందుతున్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి సేల్స్‌ లేకపోవడంతో దాదాపు ఏడాదిన్నరగా ఎలాంటి లావాదేవీలు లేకపోవడంతో బిల్డర్స్‌ అండ్‌ పెట్టుబడిదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

రియల్‌ కుదేలుతో వ్యవస్థలన్నీ సత్తెనాశ్‌ :

తెలంగాణలో రియల్‌ రంగం కుదేలు అవడంతో వ్యవస్థలన్నీ సత్తెనాశ్‌ అయ్యాయి. మహానగరంలో రియల్‌ ఎస్టేట్‌ దందా ఒక్కసారిగా పడిపోయాయి. హైదరాబాద్‌ లో ఇండ్లు కొనే నాధుడే లేడు. హైదరాబాద్‌ మహానగరంలో ఓవరాల్‌ గా ఇళ్ల విక్రయాలు 42 శాతానికి తగ్గిపోయాయి. అంటే దాదాపుగా గతంలో కంటే ఇప్పుడు సగానికి సగం రియల్‌ ఎస్టేట్‌ పడిపోయినట్లేనని లెక్కలు చెబుతున్నాయి. దీంతో భవన, నిర్మాణ రంగాలు పూర్తిగా స్తంభించిపోయాయి. బిల్డింగ్‌ కన్‌ స్ట్రకషన్స్‌ నిలిచిపోవడంతో ఆ రంగాన్నే నమ్ముకున్న వారంతా రోడ్డున పడ్డారు. తాపీ మేస్త్రీ, కూలీలు, సెంట్రింగ్‌, రాడ్‌ బెండిరగ్‌, ఎలక్ట్రిక్‌, పీఓపీ, పెయింటింగ్‌ వర్క్‌ చేసే కార్మికులు అంతా ఉపాధి కోల్పోయారు. ఏడాదికి పైగా రియల్‌ రంగం పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అదేవిధంగా సిమెంట్‌, ఐరెన్‌, స్టీల్‌, కలర్స్‌ అమ్మే వ్యాపారులకు కొనుగోళ్లు నిలిచిపోయాయి. అలాగే ఇసుక, ఇటుక, కంకర తయారు చేసే కార్మికులకు సైతం పనులు లేక పోవడంతో దిగాలు చెందుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ కింద ఆధారపడ్డ వివిధ రకాల పనులు నిలిచి పోవడం నిరుపేద, పేద తరగతి వారు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఇన్ని నెలలు పనులు లేకపోవడంతో కుటుంబాలను వెళ్లదీసేదెలా అని కన్నీటి పర్యంతమవుతున్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు రియల్‌ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. హైదరాబాద్‌ లో ఎక్కువ మంది ఈ రంగాన్నే నమ్ముకుని బతుకుతున్నారు. ఇలాంటి వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అసలే నిత్యావసరాల ధరలు పెరిగి సతమతం అవుతుంటే రియల్‌ ఎస్టేట్‌ పడిపోవడంతో అరకొర పనులతో మూలిగే నక్కపై తాడిపండు పడ్డ చందంగా వాళ్ల దుస్థితి ఉంది.

హైడ్రా దూకుడుతో ఢమాల్‌:

రేవంత్‌ సర్కార్‌ హైదరాబాద్‌ లో తీసుకొచ్చిన హైడ్రా చర్యలతో సిటీలోని రియల్‌ ఎస్టేట్‌ రంగం పరిస్థితి చెప్పలేనంతగా కుదేలైంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల కొనాలన్న, జాగలు కొనుగోలు చేయాలన్న అందరూ జంకుతున్నారు. కోట్లు పెట్టి గతంలో నిర్మించిన ఇళ్లు, అపార్ట్‌ మెంట్లు, ప్లాట్స్‌, విల్లాలు, ఫామ్‌ హౌస్‌ లను కొనేవారు లేక పెట్టుబడిదారులు, బిల్డర్స్‌ తలలు పట్టుకుంటున్నారు. హైడ్రా దూకుడుతో పెద్ద అపార్ట్‌ మెంట్లు, ఫామ్‌ హౌస్‌ లు, భవనాలు, ఇళ్లు నేలమట్టం చేయడంతో కొత్తగా వీటిని కొనుగోలు చేయదలచిన వారు ఆసక్తిచూపడం లేదు.


తెలంగాణలో దిగాలు పడ్డ రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని మళ్లీ ప్రభుత్వం గాడిన పెడితే తప్ప అటు రాష్ట్ర ఖజానాకు పెట్టుబడిదారులు, బిల్డర్స్‌ నష్టం తప్పే ఛాన్స్‌ ఉంటుంది. అదేవిధంగా ఈ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్న కార్మికులు, కర్షకుల జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపినవారవుతారు. హైదరాబాద్‌ సహా జిల్లాలు, పట్టణాల్లో రియల్‌ వ్యాపారం సజావుగా సాగితేనే ప్రతి ఒక్కరూ సంతోషంగా బతుకగలుగుతారు. హైడ్రా, మూసీ సుందరీకరణ వంటి నిర్ణయాలపై పునరాలోచించాలి. తెలంగాణలో 30నుంచి 40శాతం వరకు దీనిమీదే ఆధారపడి ఉంది కాబట్టి భవన, నిర్మాణ రంగంలో రాష్ట్రంతో పాటు, ఇతర ప్రాంతాల వారికీ ఉపాధి దొరుకుతుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగం పడిపోవడంతో రోడ్డున పడ్డ అభాగ్యులు జీవితాలు మారిపోతాయి. అప్పుడే గవర్నమెంట్‌ ఆదాయం కూడా పెరుగుతుందని పలువురు మేధావులు చెబుతున్నారు.

మేడ్చల్‌, రంగారెడ్డి పరిధిలో తగ్గుదల

సాధారణంగా గ్రేటర్‌ పరిధిలో మేడ్చల్‌-మల్కాజ్గరి, రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కానీ గత రెండేళ్లుగా ఈ జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్లు, ఆదాయం తగ్గుతూ వస్తున్నాయి.హైదరాబాద్ల్లా పరిధిలో గత ఏడాది తొలి ఆరు నెలల్లో 30,814 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్కాగా.. రూ.758.13 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది అదే సమయంలో రిజిస్ట్రేషన్లు 30,111 డాక్యుమెంట్లకు, ఆదాయం రూ.731.15 కోట్లకు తగ్గాయి. అలాగే మేడ్చల్లో డాక్యుమెంట్లు 83,742 నుంచి 75,068కు, రంగారెడ్డిలో 1,18,072 నుంచి 1,13,570కు తగ్గాయి.

అప్పుడే హెచ్చరించి ఉంటే కొనేవాళ్లం కాదు:

ప్రత్యేక రాష్ట్రం వచ్చినంక పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ అమాంతం భూముల ధరలు పెంచింది. కానీ పేదలు, మధ్య తరగతి ప్రజలు ఇళ్లు, జాగలు కొనుగోలు చేయాలంటే కష్టంగా మారింది. ఓ వైపు చెరువులు, కుంటలు, నాలాలు, సర్కారు భూములను కబ్జాచేసి ప్లాట్స్‌ చేసి, అపార్ట్‌ మెంట్స్‌, చిన్న చిన్న ఇళ్లు నిర్మించి బిల్డర్స్‌ అమ్మజూపారు. గత పాలకులు ఎక్కడ ప్రజలను అవగాహన కల్పించే విధంగా ఏ పని చేయకపోవడంతో సామాన్య ప్రజలు చాలా మంది మోసపోయారు. ప్రజలు ఎలాంటి భూములను కొనుగోలు చేయాలో, ఎలాంటి అపార్ట్‌మెంట్‌లు కొనుగోలు చేయాలో అధికారులు చెప్పకపోవడంతో దారుణం జరిగిపోయింది. ఇరిగేషన్‌ అధికారులు అనుమతులు ఇవ్వడం, విద్యుత్‌ శాఖ సిబ్బంది విద్యుత్‌ కనెక్షన్‌, మున్సిపల్‌ అధికారులు ఇంటి నెంబర్‌, వాటర్‌ పైపు లైను, రోడ్లు తదితర మౌళిక వసతులు కల్పించడం జరిగింది.

ఇంకేముంది వీటిన్నంటితో సామాన్యులు బ్యాంక్‌ లోన్లు తీసుకొని ఇళ్లు, అపార్టమెంట్స్‌ ను కొనుగోలు చేశారు. ఇదీలా ఉంటే పండ్లున్న చెట్టుకే రాళ్లు అన్నట్టు అరకొర జీతాలతో వేలల్లో ఈఎంఐలు పెట్టుకొని పేద, మధ్యతరగతి వారు బతుకుతుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం చెరువులు, కాలువలు, బఫర్‌జోన్‌లు, గవర్నమెంట్‌ భూమిలో నిర్మించారని చెప్పి బుల్డోజర్లతో వచ్చి హైడ్రా అధికారులు కూలగొడుతుంటే కన్నీళ్ల పర్యంతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవంగా మాట్లాడితే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ల కింద పనిచేసే వాళ్లు కూడా రియల్‌ ఎస్టేట్‌ దందా చేసి ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను కబ్జాచేసి వెంచర్లు ఏర్పాటు చేసి బిల్డర్స్‌ తో అపార్టమెంట్స్‌, ఇళ్లు కట్టించి అమాయకులకు కట్టబెట్టి కోట్లల్లో డబ్బు సంపాదించారు. తీర ఇఫ్పుడు చూస్తే గత ప్రభుత్వంలోని నాయకులు ఇచ్చిన మద్దతుతోనే వెంచర్లు చేసి, అపార్ట్‌ మెంట్స్‌, ఇళ్లు కడితే వాటిని ప్రజలు ఇండ్లు, స్థలాలు కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు అదే నాయకులు ఓదార్పు యాత్రలు చేయడం చూస్తే సిగ్గనిపిస్తుంది.

మరోవైపు హెచ్‌ఎండీఏ పరిధిలో హైడ్రా కూల్చుతుంటే వాళ్ల కంట కన్నీరు తప్ప ఏం లేదు. నాడు గులాబీ పార్టీ లీడర్లు చేసిన తప్పిదాలకు మేం ఎందుకు బలి అవ్వాలంటూ కొందరు ప్రశ్నిస్తున్న పరిస్థితి. గతంలో కేసీఆర్‌ గవర్నమెంట్‌ హెచ్‌ఎండీఏ పరిధిలో అసైన్డ్‌ ల్యాండ్స్‌, చెరువులు, కుంటలు, నాలాల పరిధిలో ఉన్న భూములను రెగ్యూలరైజ్‌ చేసింది. ఇళ్లను కూడా రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చింది. అన్ని కాగితాలు పర్‌ ఫెక్ట్‌ గా ఉన్నవి కదా అని అమాయకులు కొంటే, ఇళ్లు నిర్మించుకుంటే కూడా నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూల్చివేస్తుందని వాపోతున్నారు.


తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు నెలలుగా రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలు కావడంతో అటు రియల్‌ వ్యాపారులకు ఇటు ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. భూములపై పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు, పెండ్లీలు, పిల్లల చదువుల కోసమని కొద్దో గొప్పో భూములు కొని ఉంచుకున్న సామాన్యులు సైతం వాటిని అమ్ముదామంటే కష్టతరంగా మారింది. అదేవిధంగా సర్కారు ఖజానాకు కూడా భారీగా గండిపడిరది. ఎలాంటి క్రయ, విక్రయాలు లేకపోవడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. తద్వారా గవర్నమెంట్‌ కు రిజిస్ట్రేషన్‌ రూపంలో పెద్ద ఎత్తున వచ్చే ఫీజు (డబ్బు) నిలిచిపోయింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇదీ పెద్ద నష్టంగానే చెప్పుకోవచ్చు

Latest News

అక్రమ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్..

వింతపోకడ ప్రదర్శిస్తున్న బొల్లారం మున్సిపల్ కమిషనర్ మంగతాయారు.. ప్రభుత్వ వేతనం తీసుకుంటూ ప్రైవేటు వ్యక్తులకు సేవ‌లు స‌.నె. 75లో అక్రమ విల్లాల నిర్మాణాలకు అండగా అధికారిణి కాసులకు కక్కుర్తి పడి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS