Saturday, July 5, 2025
spot_img

అవినీతి సుగంధంగా మారిన ” సునంద”

Must Read
  • డీపీవో సునంద పాలన లో అవినీతికి అడ్డాగా మారిన యాదాద్రి భువనగిరి జిల్లా!
  • కొండమడుగు గ్రామ పంచాయతీలో భారీ కుంభకోణం..!
  • రూ. 93 లక్షలకు పైగా నిధుల దుర్వినియోగం- తనిఖీ నివేదికలో స్పష్టమైన వివరాలు
  • డీపీవో ఆర్ సునంద పాత్రపై అనుమానాలు!
  • అవినీతి అధికారుల వల్ల సమాజానికి అనర్థాలు
  • దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్

“ఎందెందు వెతికినా అందందు కలదు” అన్నట్లు, యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఆర్. సునంద అవినీతి గురించి ప్రజల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. జిల్లాలోని పలుచోట్ల ఆమె అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, దివిస్ ల్యాబొరేటరీ పన్ను మదింపుల్లో అవకతవకలు జరిగాయని, దీనిపై కలెక్టర్ ఆదేశాలతో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) విచారణ జరిపి నివేదిక సమర్పించినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అధికారులు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డీపీవో కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిన వైనం!
గత నాలుగు సంవత్సరాలుగా భువనగిరి జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం అవినీతికి కేంద్రంగా మారిందని, డీపీవో శ్రీమతి ఆర్. సునంద పర్యవేక్షణలో అవినీతి తారస్థాయికి చేరిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆమె నియంతలా వ్యవహరిస్తూ, తన అనుకున్నవారిని ఉన్నత స్థానాలకు చేరుస్తున్నారని చెబుతున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఆమె అవినీతిపై మౌనంగా ఉండటంతో, సునంద “నన్ను ఎవరూ ఏమీ చేయలేరు” అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. భువనగిరి జిల్లాలో 17 మండలాలు ఉన్నా, డీపీవో సునంద ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్న 4-5 మండలాలనే పదేపదే సందర్శిస్తూ ‘స్వార్థ లాభాలు’ పొందుతున్నారని సమాచారం. ఆమె కింది స్థాయి అధికారులకు ఆర్థికంగా బలంగా ఉన్న పంచాయతీలను కేటాయిస్తూ, ప్రత్యక్షంగా, పరోక్షంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

డీపీవో పాత్రపై ప్రశ్నలు!
జిల్లా కేంద్రానికి దగ్గరగా, వరంగల్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కొండమడుగు గ్రామ పంచాయతీలో భారీ అవినీతి జరుగుతోంది. కొండమడుగు నుండి నిత్యం హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే డీపీవోకు అక్కడి అవినీతి కనిపించకపోవడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. జిల్లాలోనే అత్యధిక ఆదాయం గల కొండమడుగు గ్రామ పంచాయతీకి అనుభవం లేని, తన కనుసన్నల్లో నడిచే పంచాయతీ కార్యదర్శిని నియమించి డీపీవో తన పనులు చక్కబెట్టుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కొండమడుగు గ్రామ పంచాయతీ, ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి, మండల పంచాయతీ అధికారి (ఎంపీవో), డీపీవో ‘ఒక పాడి గేదెలా మారారని’ ప్రజలు వ్యంగ్యంగా అంటున్నారు.

రూ. 93 లక్షలకు పైగా నిధుల దుర్వినియోగం:
కొండమడుగు గ్రామ పంచాయతీలో 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు రూ. 93,40,399/- ఖర్చు చేశారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి వోచర్లు, బిల్లులు, ఎంబీలు లేకుండా రూ. 52,13,457/- చెల్లించినట్లు తనిఖీ నివేదికలో పేర్కొన్నారు. అభ్యంతరకరంగా చెల్లించిన మొత్తం రూ. 41,26,920/-గా ఉంది. మొత్తం అభ్యంతరకర చెల్లింపులు రూ. 93,40,377/-గా నమోదయ్యాయి.

గత ఎంపీవో పాత్రపై తీవ్ర ప్రశ్నలు
గతంలో బీబీన‌గ‌ర్‌ మండల పంచాయతీ అధికారిగా పనిచేసి, బదిలీపై వికారాబాద్ వెళ్ళిన అధికారిని బాధ్యురాలిని చేస్తూ తనిఖీ నివేదికలో పేర్కొన్నారు. ఆ అధికారి ‘పర్యవేక్షణ లోపం’ కారణంగానే కొండమడుగు గ్రామ పంచాయతీలో అవినీతి జరిగిందని నిర్ధారించారు. అయితే, పర్యవేక్షణ చేయలేని అధికారిని సత్కరించడం పట్ల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మండల పంచాయతీ అధికారిపై పర్యవేక్షణ బాధ్యత డీపీవోది కాదా అని, నైతిక బాధ్యత వహించాల్సిన డీపీవో సాకులు వెతుకుతున్నారని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మారుమూల మండలాలపై కన్నెత్తి చూడని డీపీవోకు, కూతవేటు దూరంలో ఉన్న కొండమడుగు పంచాయతీలో జరిగిన అక్రమాలు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం బీబీనగర్ మండల పంచాయతీ అధికారి, కొండమడుగు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి కృష్ణవేణి సురగాన విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ, అతని పర్యవేక్షణ లోపంపై నివేదికలో పేర్కొనకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025 వరకు, రూ 43,13,203 ఎలాంటి బిల్లులు, వోచర్లు, ఎంబీలు లేకుండా, అభ్యంతరకర చెల్లింపులు జరిపినప్పటికీ, అతని పర్యవేక్షణ లోపం నివేదికలో పేర్కొనకపోవడం డీపీవో తన ‘నిజ స్వరూపాన్ని’ బయటపెట్టారని ప్రజలు భావిస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ‘కళ్ళు తెరవాలని’ ప్రజలు కోరుకుంటున్నారు.

అవినీతి అధికారుల వల్ల సమాజానికి అనర్థాలు – తక్షణ చర్యలు:
డీపీవో ఆర్. సునంద వంటి అవినీతి అధికారులు పదవిలో కొనసాగడం ఉన్నతాధికారులు, జిల్లా మంత్రి అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లు ప్రజలు భావిస్తారు. అవినీతి అధికారుల వల్ల సమాజంలో నిధుల దుర్వినియోగం, అభివృద్ధి పనులకు ఆటంకాలు, ప్రజల పన్నుల డబ్బు వృథా, పాలనపై విశ్వాసం కోల్పోవడం వంటి అనర్థాలు జరుగుతాయి. ఇది వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసి, సమాజంలో నైరాశ్యాన్ని పెంచుతుంది. తక్షణమే ఈ అవినీతి వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS